31.2 C
Hyderabad
May 3, 2024 01: 09 AM
Slider ప్రత్యేకం

కేన్సర్ చికిత్సలో హోమియో వైద్యంతో మంచి ఫలితాలు

#Dr.DurgaPrasad

(నేడు ప్రపంచ కేన్సర్ దినం సందర్భంగా సత్యం న్యూస్ ప్రత్యేకం)

ఆధునిక వైద్య విధానంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చినా నేటికీ కేన్సర్ వ్యాధి బారిన పడిన వారి పరిస్థితి హృదయ విదారకంగానే ఉంది. కేన్సర్ ప్రాణాంతకమని, మరణం తధ్యమనే భావన ఇంకా పోలేదు.

ప్రపంచవ్యాప్తంగా అమెరికా లాంటి ఇతర అభివృద్ధి చెందిన దేశాలతోపోల్చితే మన భారతదేశం లో కూడా అదే పరిస్థితి ఉంది. ‘ సైటోటాక్సిక్ ‘ ప్రభావం ఉన్న ఖరీదైన చికిత్స తీసుకోవడం కూడా ఎంతో మంది భరించలేక పోతున్నారు.

ఇది కేవలం సామాజిక సమస్యగానే కాకుండా ఆర్థిక పరంగా కూడా ఆలోచించవలసిన పరిస్థితి !

దీనికి తోడు క్యాన్సర్ వ్యాధి పట్ల సమాజంలో ఉన్న అపోహలు , సందేహాలు , భయం కేన్సర్ వ్యాధిని కట్టడిచేయడంలో సవాల్ గా మారాయి.

కేన్సర్ చికిత్సలో ఉన్న సవాళ్లు

వ్యాధి ప్రారంభంలో గుర్తించ లేకపోడం

చికిత్సకు ఆర్థిక భారం

అలోపతీ మందుల దుష్ప్రభావాలు

వ్యాధి నిరోధకత లోపించడం

అతి తీవ్రమైన నొప్పులు

ఇతర దీర్ఘకాలిక సమస్యలు

త్వరితంగా శరీర ఇతర అవయవాలకు వ్యాపించడం, అనేక అవయవాలు పని చేయలేక పోవడం.

కేన్సర్ కు కారణాలు

అందరూ అపోహపడ్డట్లు కేన్సర్ వ్యాధి కేవలం వంశానుగతంగా వచ్చేది మాత్రమే కాదు. వివిధ కారణాల వల్ల  శరీరములో ఏర్పడే ‘ కార్సినోజెనిక్ ‘ పదార్థాలు  రక రకాల కేన్సర్ వ్యాధులకు దోహదం చేస్తున్నాయి.

వ్యక్తిగత జీవితం, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు, కొన్ని రకాల వృత్తులు వివిధ రకాల కేన్సర్ రావడానికి కారణం అవుతున్నాయి.

కేన్సర్ వ్యాధి నివారణ, చికిత్స

ముందుగా కేన్సర్ వ్యాధి పట్ల సరియైన అవగాహన కల్పించడం.

జీవన విధానంలో మార్పు చేసుకోవడం.

శారీరక , మానసిక దృఢత్వం పెరగడానికి భౌతిక శ్రమ, వ్యాయామం, యోగా అలవాటు చేసుకోవడం.

అలవాట్లను కట్టడి చేయడం లేదా మాన్పించడం

ఆహారపు అలవాట్లు సక్రమంగా చూసుకోవడం

వ్యాధి ప్రారంభంలోనే గుర్తించి చికిత్స ప్రారంభించడం

చికిత్స సేవలను విస్తరించడం

ఆరోగ్య మౌలిక సదుపాయాలను వృద్ధి చేసి, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడం, నొప్పి ఉపశమనానికి చర్యలు

చికిత్స లో ‘ మల్టీ డిసిప్లీనరీ ‘ పద్దతులను అవలంబించడం.. ఇవన్నీ పాటిస్తే కేన్సర్ బారిన పడకుండా కొంత వరకు కట్టడి చేస్తూ, ఒకవేళ వచ్చినా చికిత్సలో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది.

హోమియోపతి – కేన్సర్ చికిత్స

అసలు హోమియోపతి వైద్యం లో క్యాన్సర్ కు చికిత్స ఉందా ? కేన్సర్ రోగులపై హోమియో మందుల ప్రభావం ఎంతవరకు ఉంటుంది ? ఇతర చికిత్సలతో పాటు హోమియో మందులు వాడితే ఉపయోగం ఉంటుందా ?

వాస్తవంగా కేన్సర్ రోగి హోమియో వైద్యుడిని సంప్రదించే సమయానికి కేసు ముదరటం లేదా చివరి దశకు రావటము జరుగుతుంది. అప్పటికే రక రకాల చికిత్సలు ప్రారంభించి , దుష్ప్రభావాలతో రోగి శక్తి హీనుడై ఉంటాడు కాబట్టి పూర్తి నివారణ సాధ్యం కాదు.

హోమియోపతి మందులు కేన్సర్ వ్యాధి నివారణ లో రోగికి ఉపశమనం  కలిగిస్తూ సమర్థవంతంగా పని చేస్తాయి.

హోమియోపతి చికిత్స వల్ల కేన్సర్ రోగుల్లో జీవిత నాణ్యత పెరుగుతుంది.

సర్వైవల్ పీరియడ్ కూడా పొడిగింపవడుతుంది. రేడియో థెరపీ ,  కీమో థెరపీ మరియు హార్మోన్ల చికిత్సలతో వల్ల వచ్చే దుష్ప్రభావాలు తగ్గిస్తుంది.

కేన్సర్ లో ఉండే అతి తీవ్రమైన నొప్పులు , ఇతర బాధల్ని తద్వారా రోగి పడే హింసను అదుపులో పెడ్తుంది. కొంత మందిలో కేన్సర్ వ్యాధి ముదిరి ప్రాణాంతకం కాకుండా కాపాడుతుంది.

మరి కొన్ని కేసుల్లో కేన్సర్ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలకు లేదా అవయవాలకు త్వరితంగా వ్యాపించి , అవి క్షీణించకుండా అరికడుతుంది.

హోమియోపతి వైద్యంలో కూడా కేన్సర్ వ్యాధి గురించి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. చికిత్స ఏదైనా హోమియోపతి మందులు కూడా సహాయక చికిత్స గా వాడుకోవచ్చు. ఉపశమనంతో పాటు వ్యాధిని తగ్గించడంలో కూడా హోమియో వైద్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది.

డా. జి. దుర్గాప్రసాద్ రావు, సీనియర్ హోమియో వైద్యులు, హైదరాబాద్. ఫోన్ నెం: 9849182591

Related posts

విశ్వశాంతి

Satyam NEWS

గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలి

Bhavani

విజయనగరం జిల్లా స్థాయి అధికారుల‌ను ప‌ట్టి పీడిస్తున్న మ‌హ‌మ్మారి

Satyam NEWS

Leave a Comment