38.7 C
Hyderabad
May 7, 2024 17: 13 PM
Slider వరంగల్

హనుమకొండలో డౌన్ సిండ్రోమ్ డే

#anitareddy

హనుమకొండ లోని మల్లికాంబ మనోవికాస కేంద్రం లో world Down syndrome Day డే ను నిర్వహించారు. వివిధ మానసిక దివ్యాoగుల ఆశ్రమాలకు సంబంధించిన నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా  ప్రొఫెసర్ పద్మ, అనురాగ్ హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్ డాక్టర్ అనిత రెడ్డి పాల్గొన్నారు.

ముందుగా ప్రొఫెసర్ పద్మ మాట్లాడుతూ మానసిక దివ్యాంగుల పిల్లలలో down syndrome పిల్లలు అన్ని రకాలుగా ఉత్సాహంగా ఉంటారని వారికి కొంత శిక్షణ ని అందిస్తే వారు మరింత ముందుకు వెళ్తారని అన్నారు. అనిత రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులు, బధిరులు, అనాధ  పిల్లలతో గడపటం  సంతోషంగా ఉందని దివ్యాంగుల సేవ విశ్వమానవ సేవ అని ప్రతి ఒక్కరు తమకు తోచిన మేర వీరికి సహాయసహకారాలు అందించాలని కోరారు.

మానసిక దివ్యాంగులకు సేవ చేస్తున్న ఈ ఆశ్రమ సేవ చాలా గొప్పది అని అన్నారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లాలోని మానసిక దివ్యాంగుల ఆశ్రమాలు మల్లికాంబ, స్పందన ,బన్ను మనో వికాస కేంద్రం టీచర్స్ 50 మంది వరకు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  డాక్టర్ సుదీప్(ఈ ఎన్ టి  అపర్ణ హాస్పిటల్స్), ఫాదర్ జేరొమ్, వివిధ సంస్థల నిర్వాహకులు సుచరితా రెడ్డి, కిరణ్ కుమారి, బండ సదానందం, కోడం కళ్యాణ్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

వైకాపా ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారింది

Satyam NEWS

విద్యుత్ బిల్లు కట్టలేను.. ఆర్థిక సహాయం చేయండి సారు

Satyam NEWS

పనిష్ మెంట్: ఆకతాయిలపై పోలీసు కొరడా

Satyam NEWS

Leave a Comment