33.7 C
Hyderabad
April 30, 2024 00: 32 AM
Slider ప్రత్యేకం

ఖమ్మం జిల్లా పర్యటనలో షర్మిలకు అస్వస్థత

#yssharmila

అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ఖమ్మం జిల్లాకు వచ్చిన ysrtp అధ్యక్షురాలు షర్మిల స్వల్ప అస్వస్తతకు గురయ్యారు. ఆదివారం ఉదయం  కొణిజెర్ల మండలం తుమ్మలపల్లి గ్రామంకు చేరుకున్న ఆమె మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో  అస్వస్తతకు లోనయ్యారు. పక్కనే వున్న ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ గడిపల్లి కవిత ఆమెను పట్టుకుని కూర్చోపెట్టారు.  ఆమె కొంత సమయం  విశ్రాంతి తీసుకుని యధావిధిగా పర్యటనను కొనసాగించారు. అనంతరం  ఆమె  మాట్లాడుతూ  ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్  ప్రతి ఏకరాకు 10వేల నష్టపరిహారం ఇస్తానని నెల రోజులు గడుస్తున్నా మళ్ళీ దాని మాట ఎత్తటంలేదన్నారు.   కే‌సి‌ఆర్ కు తెలంగాణ రాష్ట్ర రైతుల సమస్యలు పట్టడవులేదని ఆరోపించారు.  అనంతరం ఆమె  మొక్కజొన్న పంటలను పరిశీలించారు. కాగా మొక్కజొన్న పొలంలో పర్యటిస్తున్న సమయంలో ఎండ  అధికంగా వుండటంతో ఆమె అస్వస్తతకు గురయ్యారని  ఆ పార్టీ నేతలు చెప్పారు.  ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే వున్నదని నేతలు  పేర్కొన్నారు.

Related posts

రిమ్స్‌లో కరోనా రోగులకు మెరుగైన వసతులు కల్పించాలి

Satyam NEWS

ది స్టోరీ కంటిన్యూస్: రాజధాని బిల్లుకు మోకాలడ్డిన కౌన్సిల్

Satyam NEWS

ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment