33.7 C
Hyderabad
April 29, 2024 01: 04 AM
Slider కడప

రిమ్స్‌లో కరోనా రోగులకు మెరుగైన వసతులు కల్పించాలి

#APDy.CM

కడప జిల్లా కోవిడ్-19 రిమ్స్ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ లకు మెరుగైన వసతులు కల్పించి జిల్లాలో కరోనా మరణాలు  పూర్తిగా తగ్గించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్ బాషా పేర్కొన్నారు. మంగళవారం ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ భాష జిల్లా కోవిడ్-19 రిమ్స్ ఆస్పత్రి ని ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా అంజాద్ భాష మాట్లాడుతూ దేవుని దయ.. త‌న‌ను అభిమానించే ప్రజల దీవెనల వల్ల కరోనాను జయించి బయటికి వచ్చానని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

కోవిడ్ -19 ఆస్పత్రులలో కరోనా పేషెంట్లకు మెరుగైన వసతులతో పాటు మంచి భోజనం అందించేందుకు అధిక నిధులు ఖర్చు  చేస్తున్నారన్నారు. జిల్లా కోవిడ్-19 రిమ్స్ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ లకు మూడు పూటలా నాణ్యమైన ఆహారం, వార్డులలో మెరుగైన వసతులు సరిగా లేవన్నారు. ఈమధ్య రిమ్స్ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ లకు మంచి వైద్యం, భోజన వసతి సరిగా  లేదని తమ దృష్టికి రావడంతో  నేడు రిమ్స్ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసినట్లు చెప్పరు.

ఇక నుంచి ప్రభుత్వ మెనూ ప్రకారం కరోనా పేషెంట్లకు భోజన వసతులు కల్పించాలన్నారు. కరోనా పేషెంట్ లందరికీ ఆక్సిజన్‌తో కూడిన బెడ్‌ల వ‌సతి కల్పించేందుకు కోవిడ్-19 ఆస్పత్రిలో బెడ్ ల సంఖ్య పెంచుతామని చెప్పారు. కరోనా టెస్టులు ఎక్కువగా చేయడం వల్ల పాజిటివ్ కేసులు అధికంగా బయటపడుతున్నాయన్నారు.

దీంతో ప్రభుత్వం అధిక నిధులు ఖర్చు చేసి కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ సూపరింటెండెంట్ ప్రసాద్‌రావు, ఆర్.ఎం.కొండయ్య, మెడికల్ ఆఫీసర్ రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Related posts

తాజాగా 197 కరోనా కేసులు… ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ తప్పనిసరి

Satyam NEWS

31న ‘ఊహలకే ఊపిరొస్తే’ కవితా సంపుటి ఆవిష్కరణ

Satyam NEWS

కరోనాపై యుద్ధానికి మహేష్ బాబు కోటి విరాళం

Satyam NEWS

Leave a Comment