Slider నల్గొండ

యువ తెలంగాణ పార్టీ కార్యాలయం ప్రారంభం

Bhuvanagiri

యువ తెలంగాణ పార్టీ భువనగిరి పార్లమెంట్ కార్యాలయాన్నిసోమవారం భువనగిరిలోని మగ్ధుంపల్లి రోడ్డులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమతో కలిసి జిట్టా బాలక్రిష్ణా రెడ్డి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా జిట్టా మాట్లాడుతూ స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కొనసాగుతున్ననిరంకుశ, నియంతృత్వ కేసీఆర్ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రశ్నించే గొంతుకగా యువతెలంగాణ పార్టీ రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా నిలబడుతుందన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాణిరుద్రమ గెలుపుతో చట్టసభల్లో యువ తెలంగాణ పార్టీ తొలి అడుగు వేయబోతుందాన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని విస్తరించి బలోపేతం చేయడంతో పాటు యువతకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. నిస్వార్థ సేవకులుగా పని చేసే యువతను చట్టసభలకు పంపించడమే లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నట్టు వివరించారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నతనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

అట్టహాసంగా జన్మదిన వేడుకలు

జిట్టా బాలకృష్ణారెడ్డి 48వ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జిట్టాను భారీ గజమాలతో సత్కరించారు. పట్టణ అధ్యక్షులు శీలం క్రాంతిరెడ్డి ఖడ్గాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో యువ తెలంగాణ జిల్లా అధ్యక్షులు చింతల లక్ష్మినారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమారం శంకర్, నల్లగొండ జిల్లా అధ్యక్షులు బంగారయ్య, సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మధు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గాల్ రాష్ట్ర నాయకులు మైలపాక సైదులు, కడెం సాయిలు, పాశం శంకర్ మండల పార్టీ అధ్యక్షులు చెరుకు భాస్కర్, ఎల్లాంల బాలమల్లేశ్, బొల్లు శ్రీను, చిలుగూరి సత్తిరెడ్డి, కొమ్ము బాలచందర్, భువనగిరి పట్టణ అధ్యక్షులు శీలం క్రాంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

శిక్ష తప్పదనే మంత్రి కాకాణి కోర్టులోని ఆధారాలను లేపేశారు

Satyam NEWS

పది రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

Satyam NEWS

కోటప్పకొండ అభివృద్ధికి కేంద్ర మంత్రి సహకారం

Satyam NEWS

Leave a Comment