38.2 C
Hyderabad
May 3, 2024 21: 26 PM
Slider ప్రత్యేకం

పొత్తుల ప్రకటనతో ప్యాంటులు తడుపుకుంటున్న వైసీపీ నేతలు

#Raghuramakrishnam Raju

త్వరలో రాష్ట్రంలో ఏర్పడేది ప్రజా ప్రభుత్వమే. తెలుగుదేశం, జనసేన పార్టీలో మధ్య కచ్చితంగా పొత్తు ఉంటుంది. మూడవ పార్టీ తో కూడా పొత్తు ఉంటుందా? అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. అయితే మూడవ పార్టీతోను పొత్తు ఉండాలనేది అందరి అభిమతం. పొత్తు వారికి కావాలి సమ్మతమని నరసాపురం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా నాయకుడు. ఒక కులానికి ఆయన నాయకుడు కాదు. తాను ఈ విషయాన్ని అనేకమార్లు చెప్పుకొచ్చాను. పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉందని చెబుతూనే, పవన్ కళ్యాణ్ ను పవన్ కళ్యాణ్ గా చూడలేని వారు, ఒక కుల నాయకుడిగా చూసేవారు తమకు అవసరం లేదని ఆయనే చెప్పారు. ఒక కులానికి, మతానికి ప్రాతినిధ్యం వహించేవారు మహా అంటే ఒక్కసారి నాయకుడు అవుతారేమో కానీ, జీవిత కాలం నాయకుడు కాలేరు.

రాజకీయాల్లోకి సేవా భావంతో వచ్చిన పవన్ కళ్యాణ్ ను , జగన్మోహన్ రెడ్డి వేసే చిల్లర మెతుకులకు ఆశపడే వ్యక్తులు, సంకుచిత స్వభావంతో పవన్ కళ్యాణ్ ను అప్రతిష్ట పాలు చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా ప్రయాసే అవుతుందని ఆయన విమర్శించారు.

ఏ కులాన్నయితే అడ్డుపెట్టుకొని పవన్ కళ్యాణ్ పై రాజకీయం చేయాలని కొందరు అనుకుంటున్నారో ఆ ప్రజలే రేపు వారిని చెప్పులు, రాళ్లతో కొట్టడం ఖాయం. ఒకటి రెండు చానల్స్ ని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటూ తప్పుడు ప్రచారాన్ని చేసేవారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో పవన్ కళ్యాణ్ స్పష్టతను ఇచ్చాక వారు వణికి పోతున్నారు.

శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో పొత్తులపై ఎవరికి ఎటువంటి అనుమానాలు లేకుండా పవన్ కళ్యాణ్ స్పష్టతను ఇచ్చారన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో జనసేన ముసుగులో తమ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న వారు, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గమని చెప్పుకునే వారు అవాకులు చవాకులు పేలుతున్నారు.

మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ తో పాటు మరి కొంతమంది చేస్తున్న విమర్శలు అర్థరహితము. రాష్ట్రంలో కొనసాగుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాకూడదన్నది పవన్ కళ్యాణ్ దృఢ నిశ్చయంగా కనిపిస్తోంది. జనసేనకు ప్రజాబలం ఉన్నప్పటికీ, ఎన్నికల్లో పోటీ చేసి అన్ని స్థానాలలో గెలిచే బలం లేదని పవన్ కళ్యాణే స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న వారి అరాచకాలు సహించేది లేదని, అలాగే తన పార్టీ తరపున పోటీ చేసే వారిని బలి చేయాలనుకోవడం లేదని ఆయన తేల్చి చెప్పారు.

ఎన్ని స్థానాలకు పోటీ చేశామన్నది కాదు. ఎన్ని స్థానాలలో నెగ్గా మన్నది ముఖ్యం. ఇద్దరు రైతులు కలిసి వ్యవసాయం చేస్తున్నప్పుడు పొలాలకు తెగులు వస్తే, తెగులును నిర్మూలించాకే పంటను పంచుకోవాలి. లేకపోతే ఆ తెగులు పంట పొలాన్ని నాశనం చేస్తుంది. రాష్ట్రానికి ఇప్పుడు తెగులు పట్టింది.

రాష్ట్రానికి పట్టిన తెగులు నిర్మూలించడానికి రెండు ప్రధాన ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. కేంద్రంలో బలంగా ఉన్న పార్టీ కూడా కలిస్తే మంచిదే. కాకపోతే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం అటు ఇటుగా ఆలోచిస్తున్నట్టు ఉంది. అయినా, ఆ పార్టీ జాతీయ నాయకత్వాన్ని ఒప్పిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. బిజెపి లోని రాష్ట్ర నాయకులు కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి కన్ఫ్యూజన్లో ఉన్నారు , కానీ పవన్ కళ్యాణ్ మాత్రం స్పష్టతతో ఉన్నారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

ఒక్కొక్కరు వచ్చి తనతో దెబ్బలాడాలని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. మీరందరూ కలిసి రావద్దని ఆయన చెబుతున్న తీరు అంతకంటే విడ్డూరంగా ఉంది , బ్రహ్మ రాక్షసుడిని అంతమొందించడానికి ఇద్దరు దేవతలు కలిసినట్లుగానే, రాష్ట్రంలో అరాచక పాలన తుద ముట్టించడానికి రెండు ప్రధాన ప్రతిపక్షాలు కలిశాయి.

బ్రహ్మ రాక్షసుడికి దేవతలు వరం ఇచ్చినట్లుగానే, జగన్మోహన్ రెడ్డికి ప్రజలు కొన్ని వరాలను ఇచ్చారు. ప్రజలిచ్చిన వరాలను పుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి విర్రవీగుతున్నారు. రాక్షసత్వంలో జగన్మోహన్ రెడ్డిని మించిన వారు మరొకరు లేరని తనకు తానే నిరూపించుకున్నారు. బ్రహ్మ రాక్షసుడికి వరమిచ్చిన దేవతలు కూడా విడివిడిగా అతనిపై పోరాటం చేయలేమని కలిసిపోయినట్లుగా పురాణాలు చెబుతున్నాయి.

విడివిడిగా పోటీ చేస్తే, రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనను అంతమొందించలేమన్న అనుమానం ప్రధాన ప్రతిపక్షాలకు వచ్చింది. రాష్ట్రంలోని అరాచక పాలన ను అంతమొందించాలన్న ఏకైక లక్ష్యంతో తెలుగుదేశం, జనసేన పార్టీలు రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి.

పొత్తులపై పవన్ కళ్యాణ్ స్పష్టతనిచ్చారో లేదో, కాపు కులం పేరుతో జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా పనిచేసే కొందరు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసింది జనసేన పార్టీ… కాపు సేన కాదన్నది సదరు వ్యక్తులు గుర్తించాలని రఘు రామ కృష్ణంరాజు సూచించారు. రాష్ట్రంలో గత రెండు, మూడు రోజులుగా జరిగిన సంఘటనలను చూస్తే పవన్ కళ్యాణ్ జల్సా సినిమాలోని గాలిలో తేలినట్టు ఉందే అన్న పాటలాగా మనసంతా ఆనందంతో గాలిలో తేలిపోతుందన్నారు.

Related posts

పేద ముస్లింలకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రంజాన్ తోఫా

Satyam NEWS

దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

Satyam NEWS

డబుల్ బెడ్ రూమ్ లు మొదట మాకే కేటాయించాలి

Satyam NEWS

Leave a Comment