40.2 C
Hyderabad
April 29, 2024 18: 58 PM
Slider ముఖ్యంశాలు

దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

#chandra babu

ఏపీలో అధికార వైసీపీ దొంగ ఓట్లు చేర్చడం, ప్రతిపక్ష సానుభూతిపరుల ఓట్లు తొలగించడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేయనున్నారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ను కలిసేందుకు టీడీపీ కార్యాలయం నేడు లేఖ రాసింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ అప్పాయింట్ మెంట్ దొరికితే ఈనెల 28న చంద్రబాబు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. దొంగ ఓట్లపై ఆయా జిల్లా అధికారులకు టీడీపీ నేతలు ఫిర్యాదులు చేసినా, వారు స్పందించని వైనాన్ని సీఈసీకి వివరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఏపీ ఓటర్ల జాబితాలో అక్రమాలపై సమాచార సేకరణకు ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక విభాగం ఈ దొంగ ఓట్లకు సంబంధించి సేకరించిన సాక్ష్యాధారాలను సీఈసీకి అందించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే CEC అపాయింట్‌మెంట్ కోరుతూ లేఖ రాశారు.

Related posts

వరంగల్ నగరంలో పారిశుధ్య నిర్వహణ పటిష్టంగా జరగాలి

Satyam NEWS

కరోనా నిర్మూలన సేవాకార్యక్రమాలలో ఉప్పల ట్రస్ట్

Satyam NEWS

భూకబ్జాదారునిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment