27.7 C
Hyderabad
May 11, 2024 07: 54 AM
Slider ఆంధ్రప్రదేశ్

టీటీడీ బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకించిన వైసీపీ ఎంపి

#Raghurama Krishnam Raju MP

నిరర్ధక ఆస్తుల పేరుతో భూములను వేలం వేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తప్పుబట్టారు. ఇది ముమ్మాటికీ భూముల విరాళం ఇచ్చిన దాతల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిచేయాల్సింది పోయి అదే తప్పు చేయాలని టీటీడీ భావించడం సరి కాదని ఆయన అన్నారు.

ఆస్తుల అమ్మకం దేవుడికి చేస్తున్న ద్రోహం అని ఎంపీ వ్యాఖ్యానించారు. భక్తితో ఇచ్చిన భూములు విక్రయించే నిర్ణయం సరికాదన్నారు. దాతలు ఇచ్చిన ఆస్తుల పరిరక్షణకు పాలకమండలి పనిచేయాలని రఘు రామకృష్ణంరాజు అన్నారు. ఈ విషయాన్ని టీటీడీ ఆస్తుల విక్రయం విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఈ నిర్ణయాన్ని త్వరలోనే టీటీడీ వెనక్కి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

Related posts

వైద్య కళాశాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

Bhavani

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు జయంతి నేడు

Satyam NEWS

ఒకే కుటుంబంలో అయిదుగురి అనుమానాస్పద మృతి

Satyam NEWS

Leave a Comment