30.3 C
Hyderabad
March 15, 2025 09: 53 AM
Slider గుంటూరు

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు జయంతి నేడు

#Dr.Chadalawada

మాజీ స్పీకర్, పల్నాటి పులి డాక్టర్ కోడెల శివప్రసాదరావు జయంతి నేడు నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. కరోనా లాక్ డౌన్ కారణంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు నిర్వహించారు.

కోడెల  చిత్రపటానికి ముందుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ డాక్టర్ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన సేవలు మరువలేనివని నరసరావుపేట నియోజకవర్గం అభివృద్ధితో పాటు కోటప్పకొండ పర్యావరణ కేంద్రంగా తీర్చిదిద్దారని చెప్పారు. గత 40 ఏళ్ళుగా కోడెల చేసిన అభివృద్ధి, పార్టీకి చేసిన కృషి ఎనలేనిదన్నారు.

మంచి నాయకుడిని కోల్పోవడం పార్టీకి, కార్యకర్తలకు తీరని లోటన్నారు. నరసరావుపేటలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారంటే ఆయన చేసిన కృషి ఎంతో ఉంది అన్నారు.  డాక్టర్ కోడెల శివప్రసాదరావును స్ఫూర్తిగా తీసుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఆశయాలు కొనసాగించాలని అరవింద బాబు పిలుపునిచ్చారు.

Related posts

పేదల కడుపు కొడుతున్న నిర్లక్ష్యపు అధికారులు

Satyam NEWS

ప్రియురాలి కొడుకుని చంపిన ప్రియుడు….

mamatha

ఢిల్లీ నుంచీ గ‌ల్లీ దాకా…! రామ‌తీర్ధానికి కేంద్ర మంత్రి మాండ‌వీయ‌….!

Satyam NEWS

Leave a Comment