29.7 C
Hyderabad
April 29, 2024 10: 22 AM
Slider ప్రత్యేకం

లార్డ్ బాలాజీ సేవ్ హిం: ఎవరు బ్రష్టు పట్టించారయ్య నిన్ను ?

formars attack pruthviraj

హాస్య నటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ తెలిపినట్టుగానే ఆయనను బ్రష్టు పట్టించాడని కే ప్రత్యర్థులు పన్నాగం పన్నారా ? లేక జగన్ మెప్పు పొందేందుకు రైతులను విమర్శించడం తో పాటు ఒక సామాజిక వర్గాన్నివిమర్శించడమే ఆయనకు శాపం గా మారిందా ? ఆయనపై ముఖ్యమంత్రి జగన్ గుర్రుగా ఉన్నాడా ?అంటే ఔననే సమాధానాలే వస్తున్నాయి.

ఎస్వీబీసీ ఛైర్మన్ గా పృథ్వీరాజ్ బాధ్యతలు చేప్పట్టి కొద్దీ నెలలే అయినా అయన ఛానల్ లో ప్రసారమయ్యే కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటున్నాడని ఆరోపణలు వెలువెత్తాయి .అవి పక్కన పెడితే వారం రోజులుగా ఆయన తన చేష్టలతో మాట తీరు తో వివాదాస్పదం గా మారాడు. అటు రాజధానిలో ఆందోళన చేస్తున్న రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పృథ్వీరాజ్ పై అన్ని పార్టీలూ అభ్యంతరం వ్యక్తం చేశాయి. పోసాని కృష్ణమురళి, అశ్వనీదత్ లు కూడా పృధ్వీపై ప్రతి విమర్శలు చేశారు.

తాజాగా పృధ్వీరాజ్ ఎస్వీబీసీ ఛైర్మన్ హోదాలో అక్కడ పని చేసే ఉద్యోగిని తో మాట్లాడుతున్న ఆడియో టేపులు బయట పడి కలకలం రేపుతున్నాయి. ఛానల్ లో పనిచేసే ఒక మహిళ ఉద్యోగినితో పృధ్వీరాజ్ అసభ్యకరంగా మాట్లాడుతున్న ఆడియో టేపులు ఆయన రాజకీయ జీవితానికే ప్రమాదం గా మారాయి. దీనిపై ఉద్యోగ సంఘాలు కూడా మండిపడుతున్నాయి.

వరస వివాదాల్లో చిక్కుకున్న పృధ్వీరాజ్ పై వైసీపీ అధిష్టానం చర్యలు తీసుకునే అవకాశముందంటున్నారు.అయన పదవికి రాజీనామా చేయాలనీ కోరే అవకాశమున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.అయితే కొందరు తనను బ్రష్టు పట్టించడానికే ఈ పనులు చేస్తున్నారని అయన సంజాయిషీ ఇస్తుండగాఅయన వివాద స్పద తీరే ఈ పరిస్థితికి కారణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చూడాలి ఆయనను కలియుగ దైవంవెంకన్న ఎలా కాపాడుతారో.?లార్డ్ బాలాజీ సేవ్ హిం.

Related posts

కురుమ, యాదవులను దగా చేస్తున్న కేసీఆర్

Satyam NEWS

అధ్వాన్నపు రోడ్లు: అధికార పార్టీ ప్రజాప్రతినిధి మృతి

Satyam NEWS

నాగోబా ఆలయాన్ని సందర్శించిన దివ్వాదేవరాజన్

Satyam NEWS

Leave a Comment