33.2 C
Hyderabad
May 14, 2024 12: 11 PM
Slider హైదరాబాద్

నేరాల నియంత్రణ లో యువత భాగస్వామ్యం కీలకం

#uppalpolice

నేరాల నియంత్రణ లో యువత భాగస్వామ్యం అవసరమని కుషాయిగూడ సబ్ ఇన్స్పెక్టర్లు సాయికుమార్ ఉపేందర్ లు పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని వైష్ణవి ఎంక్లేవ్ లో బ్లీడింగ్ బ్లూస్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు సాగుతున్న క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన టీం సభ్యులకు శనివారం రాత్రి జరిగిన బహుమతి ప్రదానం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సబ్ ఇన్స్పెక్టర్లు సాయికుమార్ ఉపేందర్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతీ యువకులు సాంకేతికత వీడియో గేమ్ ల మోజులో క్రీడా మైదానాలు మరిచి క్రీడలలో రాణించలేక పోతున్నారని వారు ఆందోళనను వ్యక్తం చేశారు. చిన్న చిన్న సమస్యలను సైతం అధిగమించలేక ఒత్తిడికి లోనవుతున్న యువత విలువైన తమ ప్రాణాలను ఆత్మహత్యల రూపంలో బలి తీసుకోవడం అత్యంత బాధాకరమని సబ్ ఇన్స్పెక్టర్ లు సాయికుమార్ ఉపేందర్ లు ఆవేదనను  వ్యక్తం చేశారు.

క్రికెట్ అకాడమీ ప్రారంభించి శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన నిర్వాహకులు సైదులు, రవికుమార్, శివ కుమార్ లను సబ్ ఇన్స్పెక్టర్ లు అభినందించారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధి ఎంపల్లి పద్మా రెడ్డి, వైష్ణవి ఎంక్లేవ్ అధ్యక్ష కార్యదర్శులు గంప కృష్ణ శ్రీనివాస్ గంగ ఈశ్వరయ్య టీచర్స్ కాలనీ, ఇందిరా నగర్, భరత్ నగర్,  శివ సాయి నగర్, కుషాయిగూడ అరుంధతి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సారా అనిల్ ముదిరాజ్, వేముల నరసింహ గౌడ్, కర్రే సత్యనారాయణ, నాగులపల్లి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

హెల్మెట్ సీటు బెల్ట్ పెట్టుకోని వారిపై 660 కేసులు….!

Satyam NEWS

కరోనా వార్తలకు సంబంధించి పుకార్లను నమ్మవద్దు

Satyam NEWS

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆనం

Satyam NEWS

Leave a Comment