27.7 C
Hyderabad
April 30, 2024 08: 36 AM
Slider నల్గొండ

అద్దెపల్లి ఫణిభూషణ మంగాచార్యులకు అరుదైన గౌరవ సత్కారం

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల మట్టపల్లి శ్రీ లక్ష్మీనృసింహ దేవస్థాన ఆలయ వంశపారంపర్య ప్రధాన అర్చకులు అద్దేపల్లి ఫణిభూషణ మంగాచార్యు లకు అరుదైన గౌరవ సత్కారం లభించింది.

భరతమాత ముద్దుబిడ్డ,ధైర్యానికి, దేశభక్తికి,దైవభక్తికి,ధీరత్వానికి మారుపేరైన చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వారోత్సవాలలో భాగంగా, మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని మాతృభాషా సంస్కృతి,సంప్రదాయాలలో భాగంగా, భాషా,సాహిత్య,సామాజిక విద్యా,వైద్య, క్రీడా,కళా రంగాల్లో చేస్తున్న సేవలకు గుర్తింపుగా ‘తెలుగు తేజం’ జాతీయ పురస్కారాన్ని బ్రహ్మశ్రీ బిరుదాంకితులు అద్దేపల్లి ఫణిభూషణ మంగాచార్యు లకు తెలుగు భాషా అభివృద్ధి సమితి ద్వారా బ్రహ్మశ్రీ బిరుదును,ఫీల్ ఆన్ త్రో పిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా తెలుగు తేజం జాతీయ పురస్కారాన్ని ఆదివారం హోటల్ శ్రీపాద కాన్ఫరెన్స్ హాల్ విజయవాడ లో రాజ వంశీకులు, ప్రాచీన కవుల చే స్వర్ణ కంకణ మకుట ధారణతో,శాలువాతో,పుష్పమాలికలతో ఘనంగా సత్కరించి గౌరవించి ప్రశంసాపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు,ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చైర్మన్ పి.శ్రీలక్ష్మి, శ్రీ శ్రీ కళా వేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కత్తిమండ ప్రతాప్,రాజ వంశీకులు రాజారావు వెంకట మహీ బహదూర్ సూర్యారావు బహదూర్ అప్పారావు, బహదూర్ శ్రీ కవి సార్వభౌములు శ్రీనాథ మహాకవి వారసులు కావూరి శ్రీనివాస శర్మ,కవిసామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ వారసులు సత్యనారాయణ,ప్రముఖ పండితులు, మేధావులు,ఆయా సంస్థల సభ్యులు తదితరులు పాల్గొని బ్రహ్మశ్రీ అద్దేపల్లి ఫణిభూషణ మంగాచార్యు లను సన్మానించిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా ఫణిభూషణ మంగాచార్యులు మాట్లాడుతూ అరుదైన విశిష్ఠ గౌరవ పురస్కారం, సత్కారం లభించటం తనకు చాలా సంతోషకరంగా ఉందని అన్నారు.

విశిష్ట పురస్కారం లభించడం పట్ల మట్టపల్లి బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం కమిటీ ప్రధాన కార్యదర్శి చెన్నూరు మట్టపల్లి రావు,కోశాధికారి బాచిమంచి గిరిబాబు,సభ్యులు నారపరాజు పురుషోత్తమరావు,రంగరాజు వాసుదేవరావు,భువనగిరి శ్యామ్ సుందర్,పుల్లాభొట్ల శివ సుబ్రహ్మణ్యం, ధూళిపాళ రామకృష్ణ,పులిజాల శంకర్రావు,శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాల సభ్యుడు బాచిమంచి చంద్రశేఖర్,మఠంపల్లి మండల,మట్టపల్లి గ్రామ పుర ప్రముఖులు,అధికారులు, అనధికారులు అభిమానులు తమ హర్షం వ్యక్తం చేశారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఏపీలో పగటి పూట పాక్షిక కర్ఫ్యూ

Satyam NEWS

రమ్మీ పాఠాన్ని తొలగిస్తాo

Murali Krishna

కాంగ్రెస్ ను బలోపేతం చేస్తా

Sub Editor 2

Leave a Comment