34.7 C
Hyderabad
May 4, 2024 23: 10 PM
Slider వరంగల్

ఇంటింటికీ YSR తెలంగాణ పార్టీ కార్యాచరణ

#yssharmila

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పిలుపు మేరకు  ‘ఇంటింటి వైయస్సార్ తెలంగాణ పార్టీ’ కార్యక్రమాన్ని జూన్ 1వ తేదీ నుంచి ములుగు జిల్లా లో ప్రారంభిస్తున్నామని వైయస్సార్ తెలంగాణ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అన్న తిరుపతి తెలిపారు.

ములుగు జిల్లా లో పార్టీ కార్యాలయంలో మే 30న ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ జిల్లా కోఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, మండలాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటి వైయస్సార్ తెలంగాణ పార్టీని తీసుకెళ్లాలని ఆయన తెలిపారు. వైయస్ఆర్ సంక్షేమ పథకాలను వివరించాలని, వైయస్ఆర్ పాలన మళ్లీ రావాలంటే షర్మిలక్కతోనే సాధ్యమనే ధీమా ఇవ్వాలని ఆయన కోరారు. పార్టీ శ్రేణులు చిత్తశుద్ధితో పనిచేసి, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని ఆయన కోరారు.

వైయస్ఆర్ పథకాలు:

దేశంలోనే తొలిసారిగా ఉచిత విద్యుత్ ఇచ్చిన నేత వైయస్ఆర్.

రైతు రుణమాఫీ చేసి..64లక్షల మందిని రుణ విముక్తులను చేశారు.

జలయజ్ఞం ద్వారా 36 భారీ నీటిప్రాజెక్టులు నిర్మించారు.

ఫీజు రీయింబ‌ర్స్ మెంట్, ఆరోగ్యశ్రీతో ఉచిత విద్య, వైద్యం అందించారు.

108, 104 వంటి బృహత్తర పథకాలకు శ్రీకారం చుట్టారు.

భూమి లేని నిరుపేదలకు 6 లక్షల ఎకరాలను పంచిపెట్టారు.

40 లక్షల మందికి పక్కా ఇళ్లు కట్టించి.. స్థిర నివాసం ఏర్పాటు చేశారు.

పేద ప్రజలకు రూ.2ల‌కే కిలో బియ్యం అందించారు.

77 లక్షల మందికి పెన్షన్ ఇచ్చి భరోసాగా నిలిచారు.

మహిళలు, రైతులకు పావలా వడ్డీకే రుణాలిచ్చి, ఆర్థిక తోడ్పాటు అందించారు.

ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ తీసుకువచ్చిన ఘనత వైయస్ఆర్ గారిదే.

అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డు భూములను పరిరక్షించారు.

వైయస్ఆర్ ఐదేళ్ల పాలనలో లక్ష మందికి ప్రభుత్వ ఉద్యోగాలు,

11 లక్షల మందికి ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు

రుణాలు ఇప్పించారు. పేద‌ల స్వ‌యం ఉపాధికి తోడ్పాటు అందించారు.

3లక్షల మంది ఆదివాసీ బిడ్డలకు పోడు పట్టాలు అందజేశారు.

షర్మిలక్క హామీలు:

వైయస్ఆర్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు అమలు చేస్తాం

ఉద్యోగ నోటిఫికేషన్లపైనే తొలి సంతకం. నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కృషి.

ఇంట్లో ఒక్కరి కంటే ఎక్కువ మంది అర్హులుగా ఉన్న వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మ‌హిళ‌ల‌కు పెన్షన్లు.

ఆసుపత్రుల్లో కట్టిన కరోనా బిల్లులు తిరిగి చెల్లింపు. బాధితులకు అండగా YSR తెలంగాణ పార్టీ.

ప్రజలందరికీ ఉచిత విద్య

పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు.

అర్హులైన రైతులకు పోడు పట్టాల పంపిణీ చేసి

ఆదివాసీ, గిరిజనులకు న్యాయం జరిగేలా తోడ్పాటు.

ఇల్లు లేని పేదలకు ఇండ్ల నిర్మాణం. ఆ ఇంటి

మహిళ పేరు మీదనే రిజిస్ట్రేషన్.

ప్రజలకు ఉచిత వైద్యం.. ఆరోగ్యశ్రీ పథకాన్ని

బలోపేతం చేసి, 108, 104 సర్వీసుల పునరుద్ధరణ.

పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర. కౌలు రైతులు,

రైతు కూలీల సంక్షేమానికి కృషి.

రాయితీపై విత్తనాలు, ఎరువులు పంపిణీ.

ఇన్ పుట్ సబ్సిడీ, యంత్ర ల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు.

నేతన్నలకు ఆరోగ్య బీమాతో జీవిత బీమా స‌దుపాయం.నూలు యంత్రాలకు ఉచిత కరెంట్.

నూలు యంత్రాల కొనుగోళ్ల‌పై రాయితీ. 

పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం.

చేనేత కార్మికులకు వృద్ధ్యాప్య పెన్ష‌న్ తో సంబంధం లేకుండా అదనపు పెన్ష‌న్ . చేనేతలకు

హ్యాండ్లూమ్ క్ల‌స్ట‌ర్, హ్యాండ్యూమ్  టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు

ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్న పేదల భూములు తిరిగి పేదలకు పంపిణీ.

ఎస్టీలకు జ‌నాభా ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్ల కోసం పోరాటం.

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు నిర్ణయాధికారం. స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించేలా చేసి, వారి రక్ష‌ణ‌కు పూర్తి బాధ్య‌త.

బీసీ, ఎస్టీ, ఎస్సీలకు కార్పొరేషన్ల ద్వారా లోన్లు.

అభయహస్తం డబ్బులు తిరిగి పంపిణీ.

మ‌హిళ‌ల‌కు రుణాలు పంపిణీ చేసి, ఆర్థికాభివృద్ధి సాధించేలా తోడ్పాటు.

జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు

సాగునీటి ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన బాధితుల‌కు ప‌రిహారం పంపిణీ

ఉద్య‌మ‌కారులను స్వ‌రాష్ట్ర యోధులుగా గుర్తించి, వారి సంక్షేమానికి పెద్ద‌పీట.

వైయస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన జ‌ల‌య‌జ్ఞం ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తాం.

చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌లకు 50 శాతం  ప్రాతినిధ్యానికి పెద్దపీట వేశమని తెలిపారు.

Related posts

హైదరాబాద్‌లో గోల్డ్‌ ఏటీఎం

Murali Krishna

తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

Satyam NEWS

కల్వకుర్తిలో పట్టపగలే విజృంభిస్తున్న దొంగలు

Satyam NEWS

Leave a Comment