32.2 C
Hyderabad
May 2, 2024 02: 02 AM
Slider మహబూబ్ నగర్

కల్వకుర్తిలో పట్టపగలే విజృంభిస్తున్న దొంగలు

#cluesteam

గత ఐదు రోజులు నుండి రోజువారీగా ఒకటి రెండు చోరీలతో దొంగలు తమ సత్తా చాటుకుంటున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో రాత్రిపూటనే కాకుండా పగలు కూడా దొంగలు తమ సత్తా , నైపుణ్యాన్ని చాటుకుంటున్నారు. బుధవారం వాసవి నగర్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ సమీపంలో చిరు వ్యాపారం కొనసాగిస్తూ జీవనం గడుపుతున్న వారి దుకాణంలో ఐదు వేల రూపాయలు పట్టపగలు దొంగలు దోచుకెళ్లారు.

పలహారం చేద్దామని దుకాణం షటరును సగం వరకు మూసివేసి ఇంట్లోకి వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే దొంగలు చోరీకి పాల్పడ్డారు.గత ఐదు రోజులలో రాత్రిపూట మాత్రమే చోరీలకు పాలు పడ్డ దొంగలు నేడు పట్టపగలే దోచుకుంటున్నారు. పట్టణవాసులు పిల్లల్ని బడికి పంపాలన్న, పాలకు నీళ్లకు బయటికి వెళ్లాలన్న పట్టణ ప్రజలు బొంబేలుతుతున్నారు. కొందరి బంధువులకు ప్రాణాపాయ స్థితిలో ఉండి వారిని పరామర్శించడానికి వెళ్లడానికి, వారికి సొంతంగా ఆరోగ్యం దెబ్బతిన్న మెరుగైన చికిత్స కోసం పట్నం వెళ్లాలన్న కూడా ఇంటికి తాళం వేస్తే ఏమవుతుందో అని భయబ్రాంతులకు గురవుతున్నారు.కల్వకుర్తి పట్టణవాసులకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది.దొంగలు సీసీ కెమెరాలను ధ్వంసం చేస్తూ కొన్నిటిని తీసుకు వెళుతు, చేతులకు గ్లౌజులు ముఖానికి ముసుకు తో అతి తెలివిగా ఒక్కో రోజు ఒక్కో వీధిలో రేచ్చిపోతున్నారు. ఇది ఇలా ఉంటే పట్టణ పరిధిలో పట్టణ శ్రేయస్సు కోసం వీధి వీధి ప్రజల సొమ్ముతో ఏర్పాటుచేసిన సిసి కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో కూడా తెలియదు.

కల్వకుర్తి పోలీసులపై సంధిస్తున్న వ్యంగస్త్రాలు

కల్వకుర్తి పట్టణంలో పోలీసులపై పట్టణవాసులు వ్యంగస్త్రాలు సంధిస్తున్నారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు,  కార్యకర్తలకు  మాత్రమే రక్షణ కల్పిస్తారా వారి సేవ కోసమే నా ప్రభుత్వం జీతాలు ఇచ్చేదని ప్రశ్నిస్తున్నారు. వారి బాగోగుల కోసమే విధులు నిర్వహిస్తున్నారా అంటూ నిలదీస్తున్నారు. రాత్రి పది గంటలకు ఒక్క నిమిషం అటు ఇటు అయినా దుకాణా దారులపై చిరు వ్యాపారలను బంద్ చేయాలని  మూసివేయిస్తున్నారని రోడ్లపై ఎవరు కనిపించకపోవడంతో దొంగలకు చోరీ చేయడానికి సులభతరమైందని కొందరు ఆరోపిస్తున్నారు.మొత్తం మీద కరోనా వ్యాధికి భయపడకుండా లాక్ డౌన్ లో సైతం బయట తిరిగిన పట్టణవాసులు దొంగల భయానికి ఇల్లుకు తాళం వేసి వెళ్లాలంటే తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ చోరీల అరికట్టే వ్యాక్సిన్ ను పోలీసులు ఎప్పుడు కనిపెడతారో వేసి చూడాల్సిందే.

Related posts

తెలంగాణ లో సినిమా షూటింగ్ లకు అనుమతి

Satyam NEWS

స్మార్ట్ మీటర్ల పేరుతో దగా చేస్తున్న జగన్

Bhavani

వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి రావాల్సిందే

Satyam NEWS

Leave a Comment