39.2 C
Hyderabad
May 4, 2024 21: 37 PM
Slider ప్రత్యేకం

ఒంగోలులో సీఎం జ‌గ‌న్ చే సున్నా వ‌డ్డీ ప‌థ‌కం ప్రారంభం…!

#vijayanagaramcollector

విజ‌య‌న‌గ‌రం నుంచీ వీక్షిస్తున్నక‌లెక్ట‌ర్,జేడ్పీ చైర్మ‌న్, ఎమ్మెల్యేలు…!

ముచ్చ‌ట‌గా మూడోసారి ఏపీ  సీఎం జ‌గ‌న్ ..అర్హులైన పేద మ‌హిళ‌లంద‌రికీ సున్నా వ‌డ్డీ ప‌థ‌కం ప్రారంభం సంద‌ర్బంగా మాట్లాడుతున్న సంద‌ర్బం…అదీ  ప్ర‌కాశం జిల్లా ఒంగోలులో. అన్ని జిల్లాల నుంచీ జిల్లా అధికార యంత్రాంగం అంతా..త‌మ‌,త‌మ వీడియో కాన్ఫ‌రెన్స్ హాలుల వీక్షిస్తున్నవేళ‌…విజ‌య‌నగ‌రం జిల్లాలో కూడా జిల్లా క‌లెక్ట‌ర్,,నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే,రాజాం ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ ర‌ఘురాజు, మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్ శ్రావ‌ణిలతో పాటు ఆ సున్నా వ‌డ్డీ ప‌థ‌కాన్ని అందుకోబోతున్న ల‌బ్దిదారులైన మ‌హిళ‌లు కూడా  శ్ర‌ద్ద‌గా చూస్తున్న సంద‌ర్బం…స‌మ‌యం

స‌రిగ్గా 12.33..క‌లెక్ట‌ర్ కు ఫోన్…వెంట‌నే ఎదురుగా స్ర్కీన్ పై ఒంగోలులో సున్నా వ‌డ్డీ ప‌థకం కార్యక్ర‌మం ప్రారంభం సంద‌ర్బంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతున్న వేళ‌…ఆ సీఎం వాయిస్ ను మ్యూట్ లో పెట్టారు..ఐటీ సిబ్బంది. ఓ అయిదు నిమిషాలు క‌లెక్ట‌ర్ ఫోన్ మాట్లాడిన త‌ర్వాత‌..మ‌ళ్లీ అన్ మ్యూట్ చేయ‌డంతో జిల్లా జేడ్పీ  చైర్మ‌న్ తో పాటు,ఎమ్మెల్యేలు కూడా సీఎం జ‌గ‌న్  ప్ర‌సంగాన్ని వీక్షించ‌డం మొద‌లు పెట్టారు.

మ‌ధ్య‌లో ఆరు సార్లు ఫోన్లు…సీఎం ప్ర‌సంగం నిలిపేసి మాట్లాడిన‌ క‌లెక్ట‌ర్

మ‌ళ్లీ…12 44కు  క‌లెక్ట‌ర్ కు పోన్..అటు జేడ్పీ చైర్మ‌న్, ఆ ప‌క్క‌న నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే,ఈ ప‌క్క‌న రాజాం ఎమ్మెల్యేలు..అలాగే మేయ‌ర్,డిప్యూటీ మేయ‌ర్ సీఎం జ‌గ‌న్ ప్రసంగాన్ని చూస్తుండ‌గానే మ‌ళ్లీ  వీడియోకు మ్యూట్ పెట్ట‌డంతో…క‌లెక్ట‌ర్ ఫోన్ లో మాట్లాడారు.ఇలా… స‌మ‌యం ఒంటిగంట‌వ‌ర‌కు మ‌రో నాలుగు సార్లు ఫోన్ రావ‌డం…సీఎం జ‌గ‌న్ ప్ర‌సంగాన్ని మ్యూట్ లో పెట్టి మ‌రీ క‌లెక్ట‌ర్ అత్య‌వ‌స‌రంగా హడావుడిగా మాట్లాడ‌టం…విలేకరుల  కంట‌ప‌డింది.

కేంద్ర మంత్రి రాక  కోస‌మే…ఆరు సార్లు  ఫోన్ స‌మాచారమా….?

అదేస‌మ‌యంలో అడిష‌నల్ సూప‌రెంటెండెంట్  స‌త్యనారాయ‌ణ‌, స్పెష‌ల్ బ్రాంచ్ సీఐ రాంబాబులు రావ‌డంతో….రాష్ట్ర స‌చివాల‌యం నుంచీ  అత్య‌వ‌స‌ర‌మైన స‌మాచారం కోసమే క‌లెక్ట‌ర్ మాట్లాడారాని తెలుస్తోంది. అయితే ఈ నెల  24 న జిల్లా కు  కేంద్ర మంత్రి వ‌స్తున్నార‌న్న స‌మాచారం రావ‌డంతో…ఎక్క‌డ‌…ఏ విధంగా ఏయే కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌న్న దానిపై జిల్లా క‌లెక్ట‌ర్, జేడ్పీ చైర్మ‌న్ స్వ‌యంగా పోలీసు అధికారుల‌ను సంప్ర‌దించ‌డంతో.ఆరు సార్లు క‌లెక్ట‌ర్  ఫోన్ లో మాట్లాడిన అంశానికి తెర‌ప‌డినట్ల‌యింది.

Related posts

పండిట్ కార్తీక్ దీక్షిత్ స్వామి సారథ్యంలో అమెరికాలో మహా శివరాత్రి

Satyam NEWS

పంచెకట్టు తో ఆకట్టుకున్న నట సింహం

Satyam NEWS

మర్కజ్ ఎఫెక్ట్: గుంటూరు జిల్లాలో కర్ఫ్యూ విధింపు

Satyam NEWS

Leave a Comment