40.2 C
Hyderabad
April 28, 2024 18: 58 PM
Slider ఆధ్యాత్మికం

పండిట్ కార్తీక్ దీక్షిత్ స్వామి సారథ్యంలో అమెరికాలో మహా శివరాత్రి

#mahasivaratri

అమెరికా, కమ్మింగ్ నగరంలోని శివ దుర్గాలయంలో… పండిట్ కార్తీక్ దీక్షిత్ స్వామి సారథ్యంలో మహా శివరాత్రి వేడుకలు మహా సంబరంగా జరిగాయి. ఫిబ్రవరి 18 ఉదయం 7 గంటలకు మొదలైన సప్త కళాభిషేకం… తెల్లవారుఝాము 4 గంటల వరకు నిర్విఘ్నంగా, అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు. పది వేలకు పైగా ప్రవాస భారతీయ భక్తులు తరలి వచ్చి శివ పారవశ్యంలో మునిగి తేలారు. ఈ సందర్భంగా సృష్టి స్థితి లయకారుడైన పరమ శివుని వివిధ రూపాలు సాక్షాత్కరింపజేయడంతో భక్తజనం పులకించిపోయింది. “అర్ధ నారీశ్వరం, లింగోద్భవం, భస్మాభిషేకం” వంటి రూపాలు భక్తుల్ని సమ్మోహితుల్ని చేశాయి. ఇక్కడి శివ దుర్గ ఆలయంలో… హిందూ పండుగలు అన్నీ ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. శివ రాత్రి సందర్భంగా పది వేలకు పైగా భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చినప్పటికీ… ఎవరికీ ఏ చిన్న అసొకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవడం, వారికి రెండు వందల పైచిలుకు స్వచ్ఛంద సేవకులు సహకరించడం అభినందనీయం!!

Related posts

ఇంటింటా చెట్లు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం

Satyam NEWS

కూలిన నాంప‌ల్లి స‌రాయి హెరిటేజ్ భ‌వ‌నం

Satyam NEWS

అమిత్ షా ను కలవనున్న తిరుగుబాటు ఎంపి?

Satyam NEWS

Leave a Comment