37.2 C
Hyderabad
April 30, 2024 13: 00 PM
Slider హైదరాబాద్

రంజాన్ మాస సందర్భంగా పేద ముస్లింలకు బట్టల పంపిణీ

#hydernagar

హైదర్ నగర్  డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ మసీదు వద్ద  రంజాన్ మాస పర్వదినం సందర్భంగా జరిగిన  బట్టల పంపిణీ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ఆయన ముస్లిం సోదరి సోదరమణులకు బట్టలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ రంజాన్ మాసం చాలా పవిత్రమైనది అని,  రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

రంజాన్ పర్వదినం ను పురస్కరించుకుని ముస్లిం సోదరి సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి  కేసీఆర్ ఎంతో పెద్ద మనసు తో  పేద ముస్లింలకు బట్టలు పంపిణీ చేయడం చాలా అభినదించదగ్గ విషయం అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలను ఒకే విధంగా గౌరవిస్తున్నారని, బతుకమ్మ ,రంజాన్, క్రిస్మస్ పర్వదినం లను పురస్కరించుకుని బట్టలను పంపిణీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

పండుగలకు ఎటువంటి లోటు లేకుండా పేదలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని అన్నారు. రంజాన్ మాసం ఉపవాసం తో మంచి తనం, సంస్కారం అలవడుతుందని, మతసామరస్యానికి ప్రతీకగా అందరూ కల్సిఉండాలని ఆయన అన్నారు. ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు.

షాదిముబారక్  పథకం ద్వారా ప్రతి పేదింటి ముస్లిం ఆడపిల్లకు  1 ,00 ,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, మైనారిటీ గురుకుల స్కూల్స్ ను ప్రారంభించడం జరిగినదని ఆయన వివరించారు. మైనారిటీ ల సంక్షేమానికి ప్రభుత్వం  పెద్ద పీట వేస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పారు.

Related posts

గృహలక్ష్మి పథకానికి 10 వరకే గడువు

Bhavani

గ్రూప్‌-1 కీ విడుదల

Murali Krishna

పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులను పరామర్శించిన పోలీసులు

Murali Krishna

Leave a Comment