37.2 C
Hyderabad
May 2, 2024 13: 09 PM
Slider సినిమా

పంచెకట్టు తో ఆకట్టుకున్న నట సింహం

#suma

గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వీరసింహారెడ్డి టీజర్ సెన్సేషనల్ హిట్ అయ్యింది.

అలాగే ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.  జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి.. పాటలు బ్లాక్ బస్టర్  హిట్స్ గా ఆలరించాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో వీరసింహారెడ్డి చిత్ర యూనిట్ లో ఒంగోలులో మాసీవ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించింది. భారీగా తరలివచ్చిన అభిమానులు సమక్షంలో ‘వీరసింహారెడ్డి’ ప్రీరిలీజ్ వేడుక కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ దర్శకుడు బి గోపాల్ చేతుల మీదగా విడుదలైన ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్ ప్రేక్షకులు, అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది.

Related posts

సమగ్ర శిక్ష చిరు ఉద్యోగస్తులకు అన్ని శిక్షలే

Satyam NEWS

మునిసిపల్ మంత్రి కేటీఆర్ తో ఉప్పల్ ఎమ్మెల్యే భేటీ

Satyam NEWS

శ్రీ వేంకటేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు

Satyam NEWS

Leave a Comment