28.2 C
Hyderabad
April 30, 2025 06: 06 AM
Slider ఖమ్మం

మురుగు కాల్వ సుందరీకరణకు 10 కోట్లు

#Minister Puvwada Ajay Kumar

ఖమ్మం నగర ప్రజల ఆహ్లాదం, ఆరోగ్యం కోసం లకారం ట్యాంక్ బండ్ లో మరో అద్భుతం ఆవిష్కరణ కాబోతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రెండు లకారం ట్యాంక్ బండ్ ల మధ్య ఉన్న మురుగు కాల్వను శుభ్రం చేసి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా మురుగు తొలగించి నగర ప్రజల ఆహ్లాదం, ఆరోగ్యం కోసం సుందరీకరణ పనులు చేపట్టారు.

దీర్ఘ కాలంగా నగర ప్రజలు ఎదుర్కొంటున్న మురుగు సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ కార్యాచరణ చేపట్టారు. వర్షం నీరుతో నిండి, మురుగు గా ఏర్పడి తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజల కష్టాలను శాశ్వతంగా పారద్రోలాలని సంకల్పించిన మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ సమస్యను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి అందుకు అవసరం అయ్యే రూ.10 కోట్ల నిధులు మంజూరు చేశారు. అట్టి నిధులతో ఖమ్మం లకారం ట్యాంక్ బండ్, మిని లకారంల మధ్య మురుగుకు శాశ్వతంగా చెక్ పెట్టనున్నారు.

అందుకు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఖమ్మం వైరా రోడ్డు వద్ద గల నాగార్జున ఫంక్షన్ హాల్ నుండి చెరువు బజార్ మజీద్ వరకు రూ.10 కోట్లతో దాదాపు 1.8 కి.మీ. మేర అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా మురుగు, వర్షపు నీరు వేరు వేరుగా వెళ్లేందుకు పక్కా ప్రణాళికతో కార్యాచరణ చేపట్టారు. అనేక సంవత్సరాల నుండి వర్షపు నీరు, మురుగు కలిసిపోయి నిల్వ ఉండడం వల్ల అత్యంత దుర్గంధ భరితంగా మారి, ప్రజలు అనారోగ్యం బారిన పడిన ఘటనలు అనేకం.

దీనికి జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శాశ్వత పరిష్కారంగా అండర్ డ్రైనేజ్ పైప్ లైన్ ద్వారా ఇట్టి సమస్యలకు చెక్ పెట్టనున్నారు. అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా వేరు వేరు గా వెళ్లిన మురుగు ప్రకాష్ నగర్ వద్ద గల సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (STP) కి వెళ్లి, అక్కడ శుద్ది చేయబడుతుంది. మరో పైప్ లైన్ ద్వారా వెళ్లిన వర్షపు నీరు నేరుగా మున్నేరు లో కలువనున్నాయి.

ఈ ప్రక్రియతో పొల్యూషన్ రహితంగా ఎక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వర్షపు నీరు, మురుగు నిల్వలు లేకుండా శుభ్రపడనున్నాయి. పై భాగంలో ప్రజలకు ఆహ్లాదం పంచే పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఖమ్మం త్రీ టౌన్ లో ఇప్పటికే అద్భుతంగా గోళ్ళపాడు ఛానల్ పై తీర్చిదిద్దిన పార్కులు, ఓపెన్ జిమ్ లు, ప్లాంటేషన్ , వివిధ క్రీడలను ఇక్కడ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మం రెండు లకారం ట్యాంక్ బండ్ మధ్యలో కొనసాగుతున్న ఆయా డ్రైనేజ్ నిర్మాణ పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు.

పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగర ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదం మా బాధ్యత అని, దీర్ఘకాలికంగా అనేక రోగాలకు నెలవైన ఈ మురికి కూపం మరో మూడు నెలల కాలంలోనే అద్భుతంగా అభివృద్ది చేసి సుందరీకరిస్తామని మంత్రి పువ్వాడ తెలిపారు. క్రీడా వసతులు, మినీ పార్క్, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, చిన్న పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి అన్నారు.

మంత్రి పర్యటన సందర్భంగా నగర మేయర్ పునుకొల్లు నీరజ, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు ఉన్నారు.

Related posts

మనిషికి రెండు వైపులా

Satyam NEWS

భారత్‌కు అపురూపమైన విజయం

Satyam NEWS

మహిళల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు అమలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!