31.7 C
Hyderabad
May 2, 2024 07: 56 AM
Slider విజయనగరం

పేద, శ్రామికవర్గాలకి రాజ్యాధికారమే లక్ష్యంగా 98 ఏళ్ళగా సీపీఐ పోరాటాలు

#CPI struggles

బ్రిటిష్ పాలకుల నిర్బంధకాండకు, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 1925 డిసెంబరు 26న కాన్పూర్ (ఉత్తరప్రదేశ్) గడ్డపై భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) ఆవిర్భవించి గడిచిన 97 ఏళ్ళ కాలంలో ఎన్నో వీరోచిత పోరాటాలు, మహోన్నత త్యాగాలు, మహత్తర విజయాలకు సీపీఐ ప్రతీకగా నిలిచిందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ తెలిపారు.

భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) 98 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో పి.డబ్ల్యు మార్కెట్ శాఖలో ర్యాలీ నిర్వహించి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ నేతృత్వంలో ఎర్రజెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా బుగత అశోక్ మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యo కావాలని నినదించిన మొట్టమొదటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) మాత్రమే అని తెలిపారు. ఆ తర్వాత దేశ ప్రజల సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కుల కోసం సుదీర్ఘమైన గర్వకారణమైన పోరాటాలు అనేకం నడిపిందన్నారు. స్వాతంత్య్ర్యం తరువాత ప్రధాన ప్రతిపక్షంగా పార్లమెంటులో పనిచేసిందని..

ఈ విప్లవాత్మక, సాహసోపేతమైన ప్రస్థానం ఇప్పుడు 98వ సంవత్సరంలోకి అడుగుపెడుతోందన్నారు. అనేక కుట్రలు, కుతంత్రాలు, దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కోవడమే కాకుండా లాఠీలు, తూటాలను కూడా లెక్కచేయకుండా ఎందరో కమ్యూనిస్టు నేతలు జైళ్లకు వెళ్లడం, ఉరికంబం ఎక్కడం ద్వారా స్వాతంత్య్ర సమరంలో అగ్రభాగాన ఉండి పోరాడిన ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి మాత్రమే ఉందన్నారు. కమ్యూనిస్టుల రక్తతర్పణతో, ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నుంచి పేద, బడుగు, బలహీన, శ్రామికవర్గాలకి రాజ్యాధికారం, సోషలిస్టు సమాజ స్థాపనే లక్ష్యంగా సీపీఐ అలుపెరుగని పోరాటాలు కొనసాగిస్తుందన్నారు.

సోషలిస్టు సమాజంలోనే ప్రజలందరికీ సమాన అవకాశాలు, ప్రజాస్వామిక హక్కులు లభిస్తాయని జాతి, వర్గ, కుల, మత, లింగ వివక్ష, దురాగతాల అంతానికి సమ సమాజమే ఆవశ్యమని సిపిఐ విశ్వసించిందన్నారు. సంస్థానాల్ని ప్రజలపరం చేసి రచరిక వ్యవస్థ మట్టుబెట్టిందన్నారు. రాజభరణాల రద్దు, బ్యాంకులు జాతీయకరణ చేయించడంలో సిపిఐ మిలిటెంట్ పోరాటాలు నడిపిందన్నారు.

నిరంతరం ప్రజా శ్రేయస్సు కోరుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలూ శ్రమిస్తోందన్నారు. నేడు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఏనాడూ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఛాయలు కనిపించని ఆర్ఎస్ఎస్ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి చేరుకొని చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు సాగిస్తున్నదన్నారు. గణతంత్ర, స్వతంత్ర భారత దేశాన్ని హిందూదేశంగా మార్చాలని ఆరాటపడుతోందన్నారు.

కేంద్రంలోని నరేంద్రమోదీ నేతృత్వం వహిస్తున్న ఆర్ఎస్ఎస్ సారధ్యంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదించాలనే సంకల్పంతో; దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, లౌకిక వ్యవస్థను పరిరక్షించుకునే ఆశయంతో కమ్యూనిస్టులు కంకణబద్దులు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆ స్ఫూర్తితో మహత్తర సిద్ధాంతాల వేదికగా ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ 98వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా వాడవాడలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్. నాగభూషణం, జిల్లా సమితి సభ్యులు ఎస్. సునిల్, శాఖ సభ్యులు కె. సూర్యనారాయణ, పి. శ్రీనివాసరావు, చిన్నా, మురళి, పొందూరు అప్పలరాజు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గోన్నారు.

Related posts

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

Satyam NEWS

పెను విషాదం: సొల్లు మాటలు వినే ఓపిక ఇకలేదు

Satyam NEWS

కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చాలి: సి ఐ టి యు

Satyam NEWS

Leave a Comment