42.2 C
Hyderabad
May 3, 2024 17: 06 PM
Slider ఆదిలాబాద్

ప్రజల భాగస్వామ్యంతో ఒక్క రోజు 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం

#Asifabad Collector

భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణకు హరితహారంలో భాగంగా 4వ విడత కార్యక్రమం ఈ నెల 1 నుండి 10వ తేదీ వరకు కొనసాగుతున్నది.

ఈ సందర్భంగా 10వ తేదీన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.

మొక్కలు నాటి పరిరక్షించి వృక్షాలుగా తీర్చిదిద్దడం ద్వారా వాతావరణ సమతుల్యాన్ని కాపాడటంతో పాటు సహజ వాయువు అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని సైతం కాపాడవచ్చని పిలుపునిచ్చారు.

మిషన్ మిలియన్ ప్లాంటేషన్ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Related posts

21న సిద్ధి వెంకటేశ్వర్లు వర్ధంతి

Bhavani

పింక్ డైమండ్ పై తొలిసారి వ్యాఖ్యానించిన చంద్రబాబు

Satyam NEWS

మఠంపల్లి మండల కేంద్రంలో బిజెపి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

Satyam NEWS

Leave a Comment