40.2 C
Hyderabad
May 1, 2024 18: 27 PM
Slider జాతీయం

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 12 మంది మృతి

#chemoli

ఉత్తరాఖండ్ లోని ఛమోలీ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉర్గాం లోయలో నిర్మాణంలో ఉన్న ఉర్గాం-పల్లా జఖోలా మోటర్‌వేపై శుక్రవారం పల్లా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 500 మీటర్ల లోతైన లోయలో మాక్స్ వాహనం పడిపోయింది. వాహనంలో ఉన్న 21 మందిలో 12 మంది మరణించగా, నలుగురు గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం జోషిమఠ్ నుంచి కిమానా గ్రామానికి ప్రయాణికులతో మ్యాక్స్ వాహనం వెళ్తోంది. మధ్యాహ్నం 3:30 గంటలకు, మాక్స్ వాహనం పల్లా గ్రామం సమీపంలో ఎత్తుగా ఉన్న రోడ్డు ఎక్కడంలో విఫలమైంది. అది వెనక్కు కదులుతుండటం చూసి, దానిపై సవారీ చేస్తున్న కిమానా గ్రామానికి చెందిన జిత్‌పాల్ సింగ్, మరొకరితో కలిసి దిగి, టైరు కింద రాళ్లు పెట్టడం ప్రారంభించారు. అయితే ఓవర్‌లోడ్‌తో ఉన్న ఆ వాహనం రాళ్లను దాటి వేగంగా వెనక్కు వెళ్లిపోయింది.

ఈ క్రమంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. కొన్ని సెకన్లలో, మాక్స్ వాహనం 500 మీటర్ల లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ సహాయక చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు 12 మంది మృతదేహాలను వెలికి తీశారు. గాయపడిన నలుగురిని కూడా చికిత్స నిమిత్తం ఉర్గాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు స్థానికులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. సమాచారం అందుకున్న డీఎం హిమాన్షు ఖురానా, ఎస్పీ ప్రమేంద్ర దోబాల్ కూడా అక్కడికి చేరుకున్నారు. 11 కిలోమీటర్ల పొడవైన ఉర్గాం-పల్లా జఖోలా రహదారి 2020 సంవత్సరం నుండి నిర్మాణంలో ఉంది. తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉన్న ఉచ్చో గ్వాడ్ గ్రామ సమీపంలో రహదారిపై నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

Related posts

జనసేనపై విషం కక్కుతున్న వైసిపి నేతలు

Satyam NEWS

ధాన్యం కొనుగోలు మళ్లీ ప్రారంభించడం హర్షణీయం

Satyam NEWS

జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం: 10 మంది మృతి

Satyam NEWS

Leave a Comment