31.7 C
Hyderabad
May 2, 2024 10: 45 AM
Slider ముఖ్యంశాలు

మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కోసం పోరాటం

#PidamarthiRavi

మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కోసం పోరాటం కొనసాగుతుందని మాదిగ జెఎసి వ్యవస్థాపకులు, రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్బంగా పిడమర్తి రవి మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ డిమాండ్ చేస్తున్నట్టుగా 7 శాతం రిజర్వేషన్ సరోపొదన్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు సాధించుకోవాల్సి ఉందన్నారు. ఏబీసీడీ వర్గీకరణ పోరాటం ఏళ్ల తరబడి కొనసాగుతుందని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 18 శాతం మంది మాదిగలు ఉన్నారని తెలిపారు. ఎస్సి రిజర్వేషన్ పెంచి ఏబీసీడీలుగా పంచాలని పేర్కొన్నారు. అలాగే ఎస్సి కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న రుణం 12 లక్షల నుంచి 20 లక్షలకు పెంచాలని డిమాండ్ చేసారు.

పక్కనున్న ఏపీలో భూమి కొనుగోలు పథకం ద్వారా 25 లక్షల రూపాయలతో ఎంత భూమి వస్తే అంత కొనుగోలు చేసి ఇస్తున్నారని, తెలంగాణలో సైతం మూడెకరాల భూమి పథకం కింద 30 లక్షల రూపాయలు కేటాయించి ఎంత భూమి వస్తే అంత కొనుగోలు చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఎస్సి కార్పొరేషన్ ను మూడు కార్పొరేషన్లుగా మార్చలన్నారు. ఏబీసీడీ వర్గీకరణ కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం శాసన సభలో తీర్మానం చేసి పంపిందన్నారు. ఎస్సి ఏ లో మాదిగ ఉపకులాలు, బి లో మాదిగలు, సి లో మాలలు, డి లో మాల ఉప కులాలను చేర్చితే ఎవరికి ఇబ్బంది ఉండబోదన్నారు.

జనవరి నెలలో తాను రథయాత్ర ప్రారంభిస్తున్నానని తెలిపారు. కామారెడ్డి నుంచే ఈ రథయాత్ర ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో నూతన కమిటీని ప్రకటించారు. జిల్లా యూత్ అధ్యక్షుడుగా గంగాధర్, జిల్లా కార్యదర్శిగా శ్రీనివాస్, కామారెడ్డి పట్టణ అధ్యక్షుడిగా కొమ్ము కుమార్,

కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి దాకాల భిక్షపతి, జుక్కల్ అసెంబ్లీ వెండి యాదారావు, బాన్సువాడ అసెంబ్లీ హాలిగే శ్రీకాంత్, ఉమ్మడి జిల్లా ఇంచార్జిగా కారే పొచిరాం ను నియమించారు. ఈ సమావేశంలో జిల్లా మాదిగ జెఎసి అధ్యక్షుడు గడ్డం సంపత్ కుమార్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

దారితప్పిన బాలుడిని దరికి చేర్చిన విలేకరికి సన్మానం

Satyam NEWS

చంద్రబాబు కుట్ర వల్లనే ఆంధ్రప్రదేశ్ లో కరోనా విస్తరణ

Satyam NEWS

చంద్రబాబు తో విద్యార్ధి నేత పోలి శివకుమార్ భేటీ

Satyam NEWS

Leave a Comment