42.2 C
Hyderabad
April 30, 2024 18: 55 PM
Slider ఖమ్మం

1360 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

#Municipal Administration

ఖమ్మం నగరంలో 1360 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి శంఖుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేశారు. హెలీకాప్టర్‌ ద్వారా ఖమ్మం నగరానికి చేరుకున్న పురపాలక, రహదారులు భవనములశాఖ మంత్రి కేటీర్ లకారం ట్యాంక్‌బండ్‌పై రూ.1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్‌టిఆర్‌ పార్కును ప్రారంభించారు.

అనంతరం రూ.10 కోట్లతో నగరంలో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజ్‌, మరో రూ.2.49 కోట్లతో అమృత్‌ 2.0 అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌, నిర్మాణం పనులకు, శంఖుస్థాపనలు చేశారు. అనంతరం రూ.నగరం 20వ డివిజన్‌ ఎస్‌బిఐటి ఇంజనీరింగ్‌ కళాశాల రోడ్దు వద్ద రూ.71 లక్షలతో స్పోర్ట్స్‌ పార్క్‌ (టర్ఫ్‌కోర్టు), ప్రకాష్‌నగర్‌లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ పార్క్‌లో 108.71 కోట్లతో నిర్మించిన అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజ్‌ పైప్‌లైన్‌, వర్షపు నీరు తరలించే పనులను, విడిఓస్‌ కాలనీ వద్ద రూ.8.54 లకోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌ను, మంత్రిలు ప్రారంభించారు.

అనంతరం కాల్వఒడ్డు వద్ద రూ.690.52 కోట్లతో నిర్మించనున్న మున్నేరు ఆర్‌సిసి రక్షణ గోడల నిర్మాణ పనులకు, మున్నేరు వద్ద రూ.180 కోట్లతో నిర్మించనున్న కేబుల్‌ బ్రిడ్జ్‌ నిర్మాణ పనులకు, గట్టయ్య సెంటర్‌ నగరపాలక సంస్థ నందు ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులు రూ.20 కోట్లతో నిర్మించనున్న రోడ్ల పనులకు, ఇటివలే రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి మంజూరు చేసిన టియుఎఫ్‌ఐడిసి నిధులు రూ.100 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలకు మంత్రులు శంఖుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ ఖమ్మం నగరం అన్ని రంగాల ప్రగతిలో శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఎంతో ఆప్తుడు విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తనకు అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ అవకాశం కల్పించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు.

తెలుగు వారి ఖ్యాతిని చాటిన మహానుబావుడు నందమూరి తారక రామారావు గారని, అటువంటి మహనీయుల స్థానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. అటువంటి హహనీయుడి పేరు తనకు ఉండడం చాలా సంతోషదాయకమని మంత్రి తెలిపారు. ఇదివరకెన్నడు లేని విధంగా జిల్లాను రాష్ట్రంలోనే అన్ని రంగాలలో వ్యవసాయం, సాగు, త్రాగునీరు, ఐటి, పరిశ్రమలు, ఉపాధి కల్పన, రహదారులు, వైద్యం, ఆరోగ్యం, విద్య, సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకే దక్కుతుందన్నారు.

ఇదే సూర్తితో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఆహర్నిశలు కృషిచేస్తున్నారన్నారు. కార్యక్రమాల్లో ఖమ్మం పార్లమెంట్‌ సభ్యులు నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారధి రెడ్డి, శాసనమండలి సభ్యులు తాతా మధుసూదన్‌, జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌, పోలీసు కమీషనర్‌ విష్ణు.

యస్‌.వారియర్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమలరాజు, నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, సుఢా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటి చైర్మన్‌ దొరెపల్లి శ్వేత, డి.సి.సిబి చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, డిసిఎంఎస్‌ రాయల శేషగిరిరావు, నగరపాలక సంస్థ కమీషనర్‌ ఆదర్శ్‌ సురభి, శిక్షణ అసిస్టెంట్‌ కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

విజయనగరం ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్

Satyam NEWS

ఈ స్కూలు యాజమాన్యం నన్ను మానసికంగా వేధిస్తోంది..

Satyam NEWS

విశాఖ సిటీ వాసవి క్లబ్ డిస్టిట్ వైస్ గవర్నర్ గా కందుల నియామకం

Satyam NEWS

Leave a Comment