39.2 C
Hyderabad
April 30, 2024 21: 37 PM
Slider ప్రత్యేకం

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

#rains

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం చాలా చోట్ల, శనివారం కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

Related posts

మీ కోసం దేనికైనా తెగిస్తా: జనసేన అధినేత

Satyam NEWS

మోడీని కలిసిన గీతా గోపినాథ్

Sub Editor

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

Satyam NEWS

Leave a Comment