ఏదైనా ఛానెల్ కో, పేపర్ కో రిపోర్టర్ అనుకుంటే ఏమైనా చేసేయచ్చుఅనుకుంటున్నారు కొందరు. రిపోర్టర్లు కూడా చట్ట ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుందనే విషయం మరచిపోయి చేస్తే కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుందని ఎస్ 9 అనే ఛానెల్ పేరు పెట్టుకుని బ్యూటీ పార్లర్ల నుంచి డబ్బులు వసూలు చేసిన ఐదుగురు రిపోర్టర్లకు పోలీసులు అరెస్టు చేస్తేకానీ తెలియలేదు. అంబర్ పేట్ కు చెందిన ఏ.సురేందర్ రాజు, జీడిమెట్లకు చెందిన ఎస్ కిరణ్ కుమార్, బాలాపూర్ కు చెందిన టి.రఘునాథ్, కాచిగూడా కు చెందిన బి. రాజ కృష్ణ, ఘట్ కేసర్ కు చెందిన బి.రవి అనే ఈ ఐదుగురు హైదరాబాద్ లోని వివిధ బ్యూటీ పార్లర్లు, మసాజ్ సెంటర్ల నుంచి బెదిరించి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. ఇటీవలి కాలంలో ఎస్ ఆర్ నగర్ ప్రాంతంలోని రెండు మసాజ్ సెంటర్ల వారిని బెదిరించి రూ.40 వేలు ఒకరి నుంచి లక్ష రూపాయలు మరొకరి నుంచి వసూలు చేశారు. అదే విధంగా హబ్సిగూడ లోని మరో మసాజ్ పార్లర్ నుంచి 10 వేల రూపాయలు వసూలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని వలపన్ని పట్టుకున్నారు. వారి నుంచి 50 వేల రూపాయలు, ఎస్9 టివి గుర్తింపుకార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలె తెలంగాణ శ్రీచైతన్య కాలేజీని బెదిరించి ఆంధ్రప్రభ ఖమ్మం బ్యాచ్ రిపోర్టర్ల వ్యవహారాన్ని సత్యం న్యూస్ వెలుగులోకి తెచ్చిన విషయమే.
previous post