42.2 C
Hyderabad
May 3, 2024 16: 21 PM
Slider నల్గొండ

సిమెంటు కర్మాగారాలలో 8వ వేతన ఒప్పందం అమలుచేయాలి: సిఐటియు

#citu

సుదీర్ఘ పోరాటాలతో కార్మిక వర్గం సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని తొలగించి 12 గంటల పని విధానం అమలు చేయాలని బిజెపి ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ ఫుల్ తక్షణమే రద్దు చేయాలని ఈ నెల 28, 29వ, తేదీలలో దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండలం రాంపురం ప్రియ సిమెంట్ పరిశ్రమ కార్మికుల గేట్ మీటింగ్ లో కిష్టపట్టే ఏరియా సిమెంట్ క్లస్టర్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న శీతల రోషపతి మాట్లాడుతూ సిమెంటు పరిశ్రమలలో శాశ్వతంగా పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేయాలని, సిమెంట్ పరిశ్రమలో 8వ,వేతన ఒప్పందం అమలు చేయాలని,కనీస వేతనం నెలకి 26,000 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు.

సిమెంట్ పరిశ్రమలో పర్మినెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. భారతదేశం బిఎస్ఎన్ఎల్,రైల్వే,ఓడరేవులు,ఎల్ఐసి విమానయాన తదితర సంస్థలను బిజెపి ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని, దేశంలోని ప్రజలందరూ మన దేశ ఆస్తులను మనమే కాపాడుకోవడానికి అందరం కలిసి ఐక్యంగా ఈ నెల 28, 29వ,తేదీలలో జరిగే సమ్మెలో పాల్గొని భారతదేశ ఆస్తులను కాపాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వర్కర్స్ యూనియన్ అధ్యక్ష్య,కార్యదర్శులు తీగల శ్రీను,షేక్ అజముద్దీన్,లక్ష్మయ్య, ప్రకాష్, వీరబాబు,వై ఎస్ గౌడ్,అంకారావు,  కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

సెక్టోరల్ అధికారులే కీలకం

Satyam NEWS

దళిత బంధు లబ్దిదారుడికి వాహనం అందచేత

Satyam NEWS

ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి

Bhavani

Leave a Comment