తిరుచిరాపల్లి జిల్లాలో బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. 72 గంటలపాటు చిన్నారిని కాపాడటానికి ప్రయత్నించిన NDRF బృందం సఫలం కాలేదు. బోరుబావి నుంచి మంగళవారం తెల్లవారుజామున సుజిత్ మృతదేహాన్ని వెలికితీశారు. బాలుడు సుజిత్ మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. సుజిత్ భౌతికకాయం పూర్తిగా కుళ్లిపోయిందని తెలిపారు. బాలుడి మృతదేహాన్ని మనప్పారై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన అనంతరం సుజిత్ భౌతికకాయాన్ని మనప్పారై ఆస్పత్రి నుంచి నడుకాట్టుపట్టికి తరలించారు. సుజిత్ భౌతికకాయానికి పలువురు మంత్రులు, ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. సుజిత్‌ను కాపాడేందుకు సహాయక చర్యలు మూడు రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ నెల 25న ఇంటి వద్ద ఆడుకుంటూ సుజిత్ బోరుబావిలో పడిపోయాడు.
previous post