ఆర్టీసీ సమ్మెను కాకుండా ఆర్టీసీని ఖతం చేసేందుకు ప్రభుత్వం సకల చర్యలు తీసుకుంటున్నది. ఆర్టీసీని ప్రయివేటీకరించకుండా రూట్లను ప్రయివేటు పరం చేయబోతున్నది. త్వరంలో మొత్తం 4 వేల రూట్లలో ప్రైవేట్ బస్సులు తిరగడానికి అవకాశం కల్పించబోతున్నది. ఈ ప్రక్రియ పూర్తి అయితే ప్రజలు ఆర్టీసీని మరచిపోతారు. ఈ నాలుగు వేల రూట్లు కాకుండా మిగిలిన చోట్ల ఎటూ 7 సీటర్ ఆటోలు, మినీ క్యాబ్ లు ఉండనే ఉన్నాయి. ఇక ఆర్టీసీ పని ఉండదు. రెండు మూడు రోజులలోనే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించి, అందులో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. రూట్లకు పర్మిట్లు ఇస్తే బస్సులు నడుపడానికి ప్రైవేటువాహన యజమానులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం వెయ్యి రూట్లలో పర్మిట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే, 21,453 దరఖాస్తులు రావడం గమనార్హం. దీన్నిబట్టి రాష్ట్రంలోని ప్రైవేటువాహన యజమానుల నుంచే కాకుండా.. ఇతర రాష్ర్టాల నుంచి కూడా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నదని రవాణాశాఖా అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలిసింది.
previous post
next post