40.2 C
Hyderabad
April 28, 2024 17: 10 PM
Slider ప్రత్యేకం

మేడారం జాతరకు ఆరువేల ప్రత్యేక బస్సులు

#Sammakka-Saralamma

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. భక్తులను తరలించేందుకు ఆరు వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మేడారం జాతర 21 నుంచి 24 వరకు జరుగనుండగా, భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 18 నుంచి 25 వరకు ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు తెలిపింది.ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమక్క-సారలమ్మ జాతర సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను ఉన్నతాధికారు లతో కలిసి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి సీతక్క పరిశీలించినట్టు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

16న మేడారంలో టీఎస్‌ఆర్టీసీ బేస్‌క్యాంప్‌ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మేడారం జాతరలో దాదాపు 14 వేల మంది ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వహిస్తారని చెప్పారు.30 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని, భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి మేడారానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు.ఆయా జిల్లాల భక్తులకు సరిపడా బస్సులు ఏర్పాటు చేస్తామని సజ్జనార్‌ చెప్పారు.

Related posts

గడప గడపకు వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలకు నిరసన సెగ

Bhavani

కోవిడ్ 19 ఎదుర్కొనడానికి సర్పంచ్ లు ముందుకు రావాలి

Satyam NEWS

సిలెండ‌ర్ల లారీని ఓవ‌ర్ టేక్ చేయ‌బోయి…!

Satyam NEWS

Leave a Comment