27.7 C
Hyderabad
April 30, 2024 07: 36 AM
Slider నిజామాబాద్

అవిశ్వాసంతో చైర్మన్ పదవి ఊస్ట్

కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవిపై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం అధికార పార్టీ కౌన్సిలర్ల మద్దతుతో నెగ్గింది. ఈ నెల 11 న మున్సిపాలిటీకి చెందిన 27 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు చైర్మన్ నిట్టు జాహ్నవిపై అవిశ్వాస నోటీసును జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు అందజేయగా 30 న అవిశ్వాసానికి తేదీ నిర్ణయించారు. నోటీసు ఇచ్చిన రోజునే 27 మంది కౌన్సిలర్లను హైదరాబాదు క్యాంపుకు తరలించారు. మున్సిపాలిటీలో 49 మంది కౌన్సిలర్లు ఉండగా కాంగ్రెస్ కు 27, బీజేపీకి 6, బీఆర్ఎస్ కు 16 మంది కౌన్సిలర్లు ఉన్నారు.

అవిశ్వాసానికి 34 మంది సభ్యుల కోరం అవసరం కావడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతు కాంగ్రెస్ పార్టీ కోరడంతో 16 మంది కౌన్సిలర్ల నుంచి 10 మంది మద్దతును ప్రకటించారు. దాంతో వారిని కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు గోవాకు తరలించారు. నేడు అధికారుల ఆదేశం ప్రకారం నేడు మున్సిపల్ కార్యాలయంలో భారీ బందోబస్తు నడుమ అవిశ్వాసానికి అన్ని ఏర్పాట్లు చేశారు. గోవా క్యాంప్ నుంచి శుక్రవారమే హైదరాబాదుకు చేరుకోగా నేడు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కామారెడ్డికి చేరుకున్న కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవిశ్వాస సమావేశంలో పాల్గొని చైర్మన్ నిట్టు జాహ్నవికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో చైర్మన్ తన పదవి కోల్పోయారు. వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు.

అవినీతి పీడ పోయింది: షబ్బీర్ అలీ

అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పదవిని దుర్వినియోగం చేస్తూ అనేక అవినీతి అక్రమాలు చేశారని చాలా సార్లు ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో అవినీతి పీడ పోయిందని, ఇకపై కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అవినీతి రహిత పాలన అందిస్తుందన్నారు. భూ కబ్జాలు ఇంటి పర్మిషన్లకు లంచాలు లేకుండా అందరికీ ఒకేలా పాలన అందిస్తుందని తెలిపారు.

గడిచిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఛీ కొట్టారని, అవినీతితో నిండిపోయి బిఆర్ఎస్ పార్టీ కంపు కొడుతుందన్నారు. కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై కామారెడ్డి అభివృద్ధికి 50 కోట్ల విడుదల చేయాలని కోరారని, దానికి సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో అనావృష్టి వల్ల ఆరుసార్లు పంట నష్టపోతే ఒక్కసారి కూడా పంట నష్టపరిహారం అందించలేదని, కనీసం వారిని పరామర్శించిన పాపాన పోలేదని విమర్శించారు. కెసిఆర్ వేల కోట్ల అవినీతితో మేడిగడ్డ కృంగిపోయిందిల్ని, పంటలకు నీరు అందుతాయన్న రైతుల ఆశలు సన్నగిల్లాయన్నారు.

లిక్కర్ కుంభకోణంలో కూతురు కవిత జైలుకెళ్ళిందని, భూ కబ్జాలతో సంతోష్ రావు, కన్నారావు, ఫోన్ ట్యపింగ్ కేసులో కేటీఆర్ జైలుకుపోయే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఇక బీఆర్ఎస్ నాయకులు వెళ్లాల్సింది ప్రజల వద్దకు కాదని జైలుకేనన్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

దేశ భవిష్యత్ యువతపైనే

Bhavani

మున్నూరు కాపు కార్పొరేషన్ సాధన కోసం ఉద్యమిస్తాం

Satyam NEWS

మృత్యువాత పడిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం

Satyam NEWS

Leave a Comment