42.2 C
Hyderabad
May 3, 2024 15: 58 PM
Slider ఖమ్మం

యువకుడి దారుణ హత్య

#brutal murder

జిల్లా కేంద్రంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఖమ్మం పంపింగ్ వెల్ రోడ్‌లో యువకుడిని కొందరు యువకులు హత్య చేశారు. మృతుడు సాయి పవన్‌(23)గా గుర్తించారు. మరొక యువకుడు సాయి తీవ్రంగా గాయపడ్డారు. గంజాయి మత్తులో ఘర్షణ చోటు చేసుకుందని.. కత్తులతో యువకులు దాడి చేసినట్లు తెలుస్తోంది. గాయపడిన సాయిని చికిత్స నిమిత్తం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

మృతుడు చికెన్‌ షాపులో పనిచేస్తున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related posts

17 ఏళ్లు రాష్ట్ర మంత్రిగా 5 ఏళ్లు కేంద్ర మంత్రి గా మీరేం చేసారు…?

Satyam NEWS

లేమాన్ ట్రీ హోటల్ లో సెక్స్ రాకెట్ గుట్టుర‌ట్టు..?

Satyam NEWS

ఈజ్ ఇట్ ట్రూ: పాకిస్తాన్ భూభాగంలో చైనా సైన్యం లేదు

Satyam NEWS

Leave a Comment