33.7 C
Hyderabad
April 29, 2024 01: 33 AM
Slider కడప

విడతలవారీగా పంపిణీ చేయడం బాధాకరం

adinarayana reddy

ప్రతి ఒక్కరికి ఆన్లైన్ అకౌంట్ ద్వారా వెయ్యి రూపాయలను రేపట్నుంచే జమచేయాలని కడప జిల్లా జమ్మలమడుగు కు చెందిన మాజీ మంత్రి బిజెపి నేత ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేశారు.

తన నివాసంలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామని, రేషన్ కార్డు కు వెయ్యి రూపాయల నగదు అందిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించినప్పటికీ విడతలవారీగా పంపిణీ చేయడం బాధాకరమన్నారు.

నగదు పంపిణీ నాలుగవ తేదీ నుండి కాక ఇప్పుడే అందించా లన్నారు. ప్రపంచ దేశాల్లోనే కరోనా మనం చేస్తున్న లాక్ డౌన్ ఆదర్శనీయం అని అన్నారు. శుభ్రత కులం మానవత్వం మతం అని, పది రూపాయల చొప్పున ప్రతి ఒక్కరూ కరోనా సహాయనిధికి అకౌంట్లో వేయాలని కోరారు.

కరోనా వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఉచితంగా పంపిణీ చేసేందుకు బియ్యం కేటాయింపు, ఉపాధి హామీ పథకానికి అదనపు నిధులు మంజూరు వంటి అనేక చర్యలు ప్రధాని మోడీ చేపట్టడం అభినందించ దగ్గదని అన్నారు. తెలుగు కోడలు ఆర్థిక శాఖ మంత్రి గా నిర్మల సీతారామన్ కావడం మన అదృష్టం మని, ఇంట్లో కూర్చొని యోగ ఆధ్యాత్మికత వైపు దృష్టిని మళ్ళించాలని విజ్ఞప్తి చేశారు.

Related posts

మున్సిపల్ శానిటేషన్ వర్కర్ పై కర్రతో దాడి

Bhavani

జగనన్న కాలనీ పనులు ముమ్మరం చేయాలి

Bhavani

దాసుకి ఊస్టింగ్… ప్రసాదుకి పోస్టింగ్

Satyam NEWS

Leave a Comment