40.2 C
Hyderabad
April 26, 2024 12: 45 PM
Slider నల్గొండ

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందా?

#PCC President Uttam

రుణమాఫీ అంశంలో మంత్రిని ప్రశ్నిస్తే ఇష్టారాజ్యంగా మాట్లాడటం అన్యాయమని ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ అన్నారు. నల్గొండ జిల్లాలో వ్యవసాయం సంక్షోభం లోకి వెళ్లిపోయిందని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన అన్నారు.

వ్యవసాయ పంటలకు నియంత్రిత సాగు విధానం సరి కాదని, పండిన పంటలకు మద్దతు, గిట్టుబాటు ధరలు కల్పించి రైతులు ఆత్మగౌరవంతో జీవించేలా చేయాలని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా లక్ష రూపాయలు ఋణమాఫీ చేసిందా? చేయకపోగా దానిని ప్రశ్నించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని మంత్రి జగదీశ్వర్ రెడ్డి హెచ్చరిస్తూ మాట్లాడారని ఆయన అన్నారు.

ప్రజాస్వామ్యం లో ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా ఉంటాయా అని నాగన్న అన్నారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కి విఘాతం కల్గించడమే అవుతుందని,ఈ రోజు నల్గొండలో జరిగిన సంఘటన పట్ల వెంటనే మంత్రి  జగదీశ్వర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి క్షమాపణ లు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ,  INTUC డిమాండ్ చేస్తున్నాయని ఆయన అన్నారు.

Related posts

భారత్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ టెడ్రోస్ కృతజ్ఞతలు

Sub Editor

మంద కృష్ణ మాదిగను పరామర్శించిన ఆర్ఎస్పి ప్రతినిధుల బృందం

Satyam NEWS

సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిని కొనసాగించాలి

Satyam NEWS

Leave a Comment