42.2 C
Hyderabad
May 3, 2024 17: 50 PM
Slider అనంతపురం

చిరుధాన్యాల ఉపయోగంతో ఆరోగ్యకర సమాజాన్ని తయారు చేయాలి

#snacks

చిరుధాన్యాల సాగుకు పూర్వ వైభవం

చిరుధాన్యాల ఉపయోగంతో ఆరోగ్యకర సమాజాన్ని తయారు చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరామంలో డిఆర్డీఏ, వైకేపీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ చిరుధాన్యాల మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డ్ చైర్ పర్సన్ రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిరుధాన్యాలకు మన దేశం పుట్టినిల్లుని, అందులో మన రాష్ట్రం ఇంకా ప్రాముఖ్యత చెందిందని, చిరుధాన్యాల సాగులో మన జిల్లా ఎప్పుడు ముందంజలో ఉంటుందన్నారు. సజ్జలు, జొన్నలు, రాగులు, తదితర చిరుధాన్యాలలో పోషక విలువలు అధికంగా ఉన్నాయని, వాటిని వాడి మన తాత ముత్తాతలు బలంగా ఉండేవాళ్ళన్నారు. పోషక విలువలో ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఈతరంవారు తగ్గించారని, చిరుధాన్యాల సాగుకు పూర్వవైభవం తీసుకువచ్చేలా దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం కనీసం మద్దతు ధర ప్రకటించిందన్నారు.

ప్రస్తుతం చిరుధాన్యాలకు పూర్వవైభవం వస్తోందన్నారు. మన జిల్లా చిరుధాన్యాల సాగుకు ఎంతో అనువైన ప్రాంతమని, దీన్ని సద్వినియోగం తీసుకొని చిరుధాన్యాలను అధికంగా సాగు చేయాలన్నారు. పిల్లలకు మంచి పోషక విలువలు అందించాలన్నారు. మంచి పోషక విలువలు కలిగిన రాగిజావను విద్యార్థులకు అందించే కార్యక్రమం జరుగుతోందన్నారు. సివిల్ సప్లై ద్వారా వచ్చే నెల నుంచి బియ్యం వద్దన్న వారికి రాగులు కూడా ఇవ్వడం

జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో పిల్లలకు చిరుధాన్యాల గురించి తెలియజేసి ఆరోగ్యకర సమాజాన్ని తయారు చేయాలని, ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలు తిని ఇతరులతో తినిపించాలన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాన్ని నిలబెట్టాలని, నెలకు ఒకసారి ఏదైనా ఒక పాఠశాలను ఎంపిక చేసి చిరుధాన్యాలపై ఎగ్జిబిషన్ నిర్వహించాలని డిఆర్డీఏ పిడికి సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాగి, జొన్న, సద్ద, తదితర చిరుధాన్యాలతో తయారుచేసిన వంటలను మర్చిపోతున్నారని, పోషక విలువలు లేక మనిషి శరీరం చచ్చుబడి పోతుందని, ఇంతకుముందు తాతముత్తాతలు చిరుధాన్యాల ఉపయోగంతో ఎలాంటి రోగాలు లేకుండా వండా ఏళ్ళు జీవించారన్నారు. మనం తినే ఆహారంలో లోపం వల్ల రోగాలు వస్తున్నాయని, చిరుధాన్యాలు వాడితే డాక్టర్ అవసరం ఉండదని, ప్రతి ఒక్కరూ సిరి ధాన్యాలు వాడాలన్నారు. జిల్లాలో 60 వేల ఎకరాల్లో చిరుధాన్యాల సాగు చేస్తున్నారని, లక్ష ఎకరాల్లో మిల్లెట్స్ సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు.

చిరుధాన్యాలకు మద్దతు ధర ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మద్దతు ధర ఇచ్చారన్నారు. ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలను ఉపయోగించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చిరుధాన్యాల స్టాల్స్ ను ఏర్పాటు చేయాలన్నారు.

జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డ్ చైర్ పర్సన్ రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళలకు అన్ని కార్యక్రమాలలోనూ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అంతర్జాతీయ చిరుధాన్యాల మహోత్సవం నిర్వహించడం అద్భుతం అన్నారు. గ్రామస్థాయిలోను ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామాలు బాగుపడాలంటే చిరుధాన్యాల సాగు ఎంతో ముఖ్యమని, రాగి, సజ్జా, కొర్ర, తదితర చిరుధాన్యాలు ఉపయోగించాలన్నారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలన్నారు.

అంతకుముందు మిల్లెట్ కేక్ ను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే తదితరులు కట్ చేశారు. ఈ సందర్భంగా సిడిపిఓ రెడ్డి రమణమ్మ సిరిధాన్యాల సాగుపై పాడిన పాట ఆకట్టుకుంది. అనంతరం చిరుధాన్యాల ఎగ్జిబిషన్ లో పాల్గొన్న వివిధ సంస్థల ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులకు మెమెంటోలు, సర్టిఫికెట్ లు అందించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పిడి నరసయ్య, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, సివిల్ సప్లై డిఎం అశ్వర్థ నారాయణ నాయక్, ఐసిడిఎస్ పిడి లక్ష్మి కుమారి, వ్యవసాయ శాఖ ఏడి పద్మావతి, పుడా చైర్మన్ లక్ష్మీ నరసమ్మ, ఎంపిపి రమణా రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ తుంగా ఓబులపతి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, శాస్త్రవేత్త శ్రీనివాస్, ప్రకృతి వ్యవసాయం లక్ష్యానాయక్, రెడ్స్ సంస్థ భానుజ, వాసన్, టింబక్ట్, ఎపిఎంఏఎస్, ఏఎఫ్ ఎకాలజీ ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా నిబంధనలు పాటించని మండల విద్యాధికారి

Satyam NEWS

లక్ష్మణ్ కు వినతిపత్రం అందజేత

Satyam NEWS

తెలంగాణకు ఆక్సిజన్, వ్యాక్సిన్ అదనపు కోటా విడుదల

Satyam NEWS

Leave a Comment