38.7 C
Hyderabad
May 7, 2024 17: 21 PM
Slider ముఖ్యంశాలు

చిత్తూరు విజయా డెయిరీ స్క్రాప్ లో భారీ కుంభకోణం

#Tukku

తుక్కుతో కూడా కుంభకోణం చేయవచ్చని చిత్తూరు విజయా డైయిరీ వ్యవహారంలో నిరూపితం అయ్యింది. కుంభకోణానికి ఏది కాదు అనర్హం అని అధికార పార్టీ ప్రజలకు చాటి చెప్పింది. చిత్తూరు విజయా దైయిరిని అముల్ కు 99 సంవత్సరాలకు లీజుకు ఇస్తూ ముఖ్యమంత్రి జగన్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.

దానిని పాల ఉద్పత్తిదారులు, రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సహకార రంగంలోనే విజయా దైయిరిని నడిపించాలని కోరుతున్నారు. ఈ వివాదం అటు ఉండగానే, డైయిరీ వ్యవస్థాపకులు NP వీరరాఘవులు నాయుడు విగ్రహాన్ని తొలగించి మరోమారు పది రైతుల ఆగ్రహానికి గురయ్యింది. రెండు సమస్యలు ఉండగానే డైయిరీ తుక్కు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆరు కోట్ల రూపాయల విలువ చేసే తుక్కును కేవలం 1.5 కోట్ల రూపాయలకే ధారాదత్తం చేశారు. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి.

చిత్తూరు విజయా డెయిరీలో స్క్రాప్ పేరుతో కోట్లు కొల్ల గొట్టేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అందులో ఉన్న విలువైన స్టీల్ ను తుక్కు కింద విక్రయించేందుకు అధికారులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందుగానే అందులోని సామాగ్రిని ఖాళీ చేయాలనే నిబంధనతో కలెక్టర్ టెండర్ ఖరారు చేశారు.

అయితే ఈ వేలం పాటలో ఒక వర్గం సిండికేట్ గా ఏర్పడి కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపింది. ప్రముఖ స్టీల్ సంస్థలకు విక్రయించాల్సిన వస్తువులను గుజిరి వ్యాపారస్తులకు నామ మాత్రపు ధరకు కట్టబెడుతున్నారు. ఈ టెండరు ఓ స్థానిక గుజరి వ్యాపారి ఒక కోటి 40 లక్షలకు సొంతం చేసుకున్నారు.

ఈ టెండర్ లో 132 మంది పాల్గొన్నారు. వారందరికీ ఎంతో కొంత ఇస్తానని ఒప్పించి కొందరు సిండికేట్ గా ఏర్పడ్డారు. టెండరు నుండి విరమించు కోవాలని తీవ్ర వత్తిడి తీసుకొనివచ్చారు. రాజకీయ వత్తిళ్ళు కూడా కున్నాయని TDP, కమ్యునిస్టు పతి నేతలు ఆరోపిస్తున్నారు. టెండరు వేసిన ప్రతి ఒక్కరికి రూ. లక్ష నుండి 50 వేల రూపాయలు ముట్టునట్లు తెలుస్తోంది. సుమారు కోటిన్నర రూపాయను టెండరు వేసిన వ్యక్తులకే ఇచ్చినట్లు సమాచారం. మరో రెండు కోట్లు రాజకీయంగా చేతులు మారినట్లు ఆరోపిస్తున్నారు.

రైతుల సొమ్మును ఎలా కుంభకోణం పేరుతో కొల్లకోట్టడం పట్ల వాటాదరులలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్తాయిలో టెండర్లు పిలిచిఉంటే, దైయిరికి భారీగా ఆదాయం వచ్చేదని భావిస్తున్నారు. ఆ డబ్బుతో ఇదివరకు దైయిరిలో పనిచేసిన వాళ్ళకి జీతాల బకాయిలు చెల్లించడానికి అవకాశం ఉంటేదని అంటున్నారు.


అయితే ఈ సామాగ్రిని ఖాళీ చేయడానికి కనీసం మూడు నెలలు సమయం కావాలని కోరారు. ఇలా ఆలస్యం చేస్తే సంబంధిత తుక్కు సామాగ్రికి ఎక్కువ రేటు తీసుకోవచ్చని వారి ఎత్తుగడ. ప్రస్తుతం సీఎం పర్యటించే ప్రాంతంలో ఉన్న సామాగ్రి వెనుక వైపుకు తరలించి పెట్టారు. ఈ టెండర్ కి ప్రముఖ సంస్థలను ఆహ్వానించి ఉంటే ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరి ఉండేది. అదే విధంగా ఆ సంస్థలు వెంటనే సామాగ్రిని తరలించి ఉండేవి. స్థానికంగా ఉండే స్క్రాప్ డీలర్లకు ఇంత సామాగ్రిని వెంటనే తరలించే సామర్థ్యం లేదు.

తగిన భద్రత ప్రమాణాలు పాటించే యంత్రాంగం లేదు. అయినా వీరికి కట్టబెట్టడం వెనక అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. గుజురి వ్యాపారస్తుల మధ్య వాటాల పంపకంలో తేడా రావడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. సీఎం పర్యటన ఏర్పాట్లు దాదాపు పూర్తి అయిన నేపథ్యంలో టెండర్ రద్దు చేసి, కొత్తగా పిలువాలని పది రైతులు రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

డైయిరీ తుక్కు కుంభకోణం విషయమై జిల్లా మంత్రి పెద్దిరెడ్డిని సోమవారం చిత్తూరులో విలేకరులు ప్రశ్నించారు. ఇందుకు మంత్రి సమాధానం ఇస్తూ.. డైయిరీ మూసివేతకు కారణం అయినా వాళ్ళు ఎదో ఆరోపణలు చేస్తున్నారని, వాటినిలో నిజం లేదన్నారు.

సాటి గంగాధర్, సీనియర్ జర్నలిస్ట్, చిత్తూరు

Related posts

అరుదైన శస్త్ర చికిత్స చేసి 4కిలోల కణితి తొలగించిన డాక్టర్ శివప్రసాద్

Satyam NEWS

ఎమ్మెల్సీ రమణ కుటుంబాన్ని పరామర్శించిన కవిత

Bhavani

గాన గంధ్వరుడు ఎస్ పి బి కి కరోనా పాజిటీవ్

Satyam NEWS

Leave a Comment