39.2 C
Hyderabad
April 28, 2024 12: 09 PM
Slider ముఖ్యంశాలు

రాసిచ్చిన స్క్రిప్ట్ తో రాహుల్ స్కిట్

Minister Harish Rao

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఖమ్మం సభలో రాహుల్ చేసిన కామెంట్స్‌కు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది అంటూ రాహుల్‌పై ఫైర్ అయ్యారు. మీ పార్టీ అవినీతికి మారుపేరుగా మారిందన్నారు. అందుకే పార్టీ పేరే స్కాంగ్రెస్‌గా మారిందన్నారు. అందుకే దేశ ప్రజలు మిమ్మల్ని అధికారం నుంచి దించి మూల‌న కూర్చోబెట్టారని హరీష్ రావు విమర్శించారు.

‘బీఆర్‌ఎస్‌ ఎవరికీ బీ టీం కాదు.. మాది పేద ప్రజలకు ఏ టీం. ప్రజల సంక్షేమం చూసే ఏ క్లాస్ టీం. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదు. అందుకే దేశాన్ని బీజేపీ కబంద హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్‌ఎస్‌ పుట్టింది. రాష్ట్రంలో పొడు పట్టాల పంపిణీ కళ్లకు కనిపించలేదా..? మేం పట్టాలు పంచినంక మళ్లీ మీరెచ్చేదేంది? అప్‌డేట్ తెలుసుకోని ఔట్ డేటెడ్ పొలిటీషియ‌న్ రాహుల్‌ గాంధీ. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు మొత్తం 80,321.57 కోట్లు. అయితే, అవినీతి లక్ష కోట్లు అని అనడం పెద్ద జోక్ అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని, కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడ ఇవ్వలేద‌ని మీ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం స‌మాధానం ఇచ్చిన విష‌యం తెలియ‌దా? స్కీమ్‌ల్లోని స్కాంల్లో ఆరితేరిన కాంగ్రెస్ కుంభకోణాల గురించి మాట్లాడడం.. దెయ్యాలు వేదాలు వల్లించ‌డ‌మే.

అప్పుడే ముదిగొండ కాల్పులను మరిచిపోయారా? భూములు అడిగితే జైల్లో వేసిన వాళ్ళు, కరెంట్ అడుగుతే పిట్టల్లా కాల్చి చంపినోళ్లు ఖమ్మంలో కల్లిబొల్లి కబుర్లు చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఖ‌మ్మం స‌భ ఒక్క ముక్కలో చెప్పాలంటే.. పసలేని ఆరోపణలు, ఊకదంపుడు ప్రసంగాలు.. రాసిచ్చిన స్క్రిప్ట్ తో రాహుల్ స్కిట్..’’ అంటూ హరీష్‌రావు దుయ్యబట్టారు…

Related posts

పోలీసుల బెదిరింపుతో వృద్ధ దంపతుల బలవన్మరణం

Satyam NEWS

తెలంగాణ పోరాటంలో కేసీఆర్ పాత్ర లేదు

Satyam NEWS

శ్రీ కోదండ రాముని కళ్యాణం లో పాల్గొన్న పర్యాటక శాఖా మంత్రి రోజా

Satyam NEWS

Leave a Comment