37.2 C
Hyderabad
May 2, 2024 13: 17 PM
Slider శ్రీకాకుళం

హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ

#Human Rights Commission

శ్రీకాకుళం స్థానిక ఏడురోడ్ల కూడలిలో మణిపూర్ ఘటనలపై జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో శాంతియుత రాలి ని నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులచే శాంతియుత ప్రమాణం చేయించి ర్యాలీని ఏడురోడ్ల కూడలి నుండి, వివేకానంద విగ్రహం వరకు కొనసాగించారు.

అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ నేషనల్ చైర్మన్ డా. పిసి సాహు ఆదేశాల మేరకు ర్యాలీ నిర్వహించామని, మణిపూర్ ఘటన యావత్ దేశాన్ని కలచివేసిందని, ఘటన జరిగి మూడునెలలు దాటినా, ఇంకా అల్లర్లు, హత్యలు , మానభంగాలు జరుగుతూనే ఉన్నాయని, అసలు మానవత్వమే అక్కడ పూర్తిగా నశించిపోయిందన్నారు.

అధికార ప్రభుత్వం, అక్కడ ఒక తెగ వారికీ అండగా ఉంటూ ఇటువంటి దుర్ఘటనలు చెయ్యిస్తుందని, అధికారములోనున్న ప్రభుత్వాలు ఇంతవరకు మణిపూర్ విషయములో సరైన నిర్ణయాలు తీసుకోవటం లేదన్నారు. ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగించిన నిందుతులకు ఉరి శిక్ష విధించాలన్నారు. సత్వరమే ప్రభుత్వాలు న్యాయం చేసే విధంగా మానవ మృగాలకు శిక్షపడేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. అప్పుడే దేశం బాగుపడుతుందని వక్తలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జాతీయ హ్యూమన్ రైట్స్ వైస్ చైర్మన్ డా. అల్లెల్ల నాగేశ్వర రావు, రాష్ట్ర ప్రెసిడెంట్ అల్లు. ఇమ్యాన్యుయేల్, రాష్ట్ర హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ డా. మంత్రి వెంకటస్వామి, జాతీయ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ డా. టి. మణికంఠ, రాష్ట్ర సెక్రటరీ జోయ్ ప్రసాద్, జిల్లా మహిళా సంరక్షక అధ్యక్షులు అల్లు సుధా, మండల సెక్రటరీ పీఎస్ విజయ్ కుమార్, ప్రేమ్ కుమారి, బాలకృష్ణ, గ్రీన్ సిటీ మణిశర్మ, చేయూత ప్రెసిడెంట్ వెంకట లక్ష్మి, నంది ఉమా శంకర్, కిల్లారి వెంకట రమణ, కే. శివ, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

లాండ్ సర్వే పూర్తయిన తర్వాత ఆన్ లైన్ లో భూముల వివరాలు

Satyam NEWS

కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే

Satyam NEWS

తాగ కుండానే కిక్కు ఎక్కించిన ఇద్దరు సిఎంలు

Satyam NEWS

Leave a Comment