ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కలిసి పయనిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ కూడబలుక్కుని పని చేస్తున్నారా అనే అనుమానం కూడా తెప్పించే విధంగా ఈ ఒక్క విషయం అనుమానం తెప్పిస్తున్నది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు విపరీతంగా పెంచేశారు.
అదే మంటే మద్య నిషేధం దిశగా వెళ్లేందుకు రేట్లు పెంచి తాగే వారిని నిరాశ పరచడం ఒక్కటే మార్గమని ఆంధ్రాలో చెప్పారు. ప్రజలంతా నిజమే కాబోలు అనుకున్నారు. అయితే మద్య నిషేధం వైపు అడుగులు వేయని తెలంగాణ ప్రభుత్వం కూడా మద్యం ధరలను విపరీతంగా పెంచేసింది.
ఆంధ్రాలో ఎక్కువ రేటు, తెలంగాణ లో తక్కువ రేటు ఉన్నప్పుడు కోదాడ తదితర ప్రాంతాల నుంచి ఆంధ్రాకు మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లి కొందరు అమ్ముకున్నారు. ఇప్పుడు అందుకు అవకాశం లేదు. తెలంగాణ లో కూడా మద్యం రేటు భారీగా పెంచేశారు. రేపటి నుంచి పెరిగిన మద్యం ధరలు అమలులోకి వస్తాయి.
అన్ని రకాల మద్యం ధరలు పది శాతానికిపైగా పెంచారు. అంటే వెరైటీని బట్టి రూ.10 నుంచి రూ.80 వరకూ రేటు పెరుగుతుంది. అదే విధంగా బీర్ ల రేటు రూ.10 నుంచి రూ.20 వరకూ పెంచేశారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 300 నుంచి రూ.400 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
అయితే ఈ ధరలు పాత మద్యం నిల్వలకు వర్తించవు. అందువల్ల అవ అయిపోయే వరకూ చీప్ రేట్ లోనే తాగవచ్చు.