40.2 C
Hyderabad
May 1, 2024 16: 59 PM
Slider వరంగల్

అరుదైన గ్రూప్ రక్తాన్ని దానం చేసిన స్కూలు టీచర్

ములుగు జిల్లా బరిగలపల్లి ప్రభుత్వ స్కూల్ లో పని చేసే టీచర్ కొత్త పల్లి పోషన్న. ఆయన బ్లడ్ గ్రూప్ బి నెగెటీవ్. ఇది చాలా అరుదైన గ్రూప్ రక్తం. అందుకోసమే ఆయన తరచూ రక్తదానం చేస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు ఆయన ఇప్పటి వరకూ 28 సార్లు రక్తదానం చేశారు. తాజాగా నడికుడ మండలం రామకృష్ణాపూర్ కు చెందిన మధుమిత కు ఆయన రక్తదానం చేశారు. మధుమిత గత కొన్ని రోజులుగా తలసేమియా వ్యాధి తో బాధపడుతున్నది.

రక్తం ప్రతీ నెలా ఎక్కించాలి. అందుకు రక్తం అవసరం అనే సమాచారం చూడటంతో కొత్త పల్లి పోషన్న హన్మకొండ లోని రెడ్ క్రాస్ సెంటర్ కు వెళ్లారు. అక్కడ మధుమితకు రక్తం దానం చేశారు. తలాసేమియా తో బాధపడుతున్న వారికి నిరంతరం రక్తం అందిస్తూనే ఉండాలని,ఏ రక్త గౄపు కావాలంటే ఆ రక్త గ్రూప్ రక్తం అందివ్వాల్సి ఉంటుదని వైద్యులు అంటున్నారు. లేకపోతే వారు తీవ్ర ఇబ్బందులు పడుతారు. బి నెగెటీవ్ రక్తం అంత సామాన్యముగా దొరకదు.

అందుకే ఇప్పటి వరకు 28 సార్లు అత్యవసర పరిస్థితిలో రక్తదానం చేయడం జరిగిందని పోషన్న తెలిపారు. 16 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్య వంతులు ప్రతీ 3 నెలల కు ఒకసారి రక్తం ఇవ్వవచ్చు. ఇలా ఇవ్వడం వలన ఒకరి ప్రాణాలను కాపాడడమే కాకుండా మనము నిత్య ఆరోగ్య వంతులు గా ఉంటాము. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ నిరంతరం రక్త దానం చేస్తూ అనేక మంది ప్రాణాలు కాపాడాలి. 28 సార్లు రక్త దానం చేసిన ఆయనను హన్మకొండ లో స్థానికంగా ఉన్న స్నేహితులు దరిగి నిరంజన్, వైనాల కుమారస్వామి, మరియు రెడ్ క్రాస్ వారు అభినందించారు.

Related posts

విశాఖ సముద్రంలో 50 అడుగుల భారీ మత్స్యం..!!

Satyam NEWS

పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

Bhavani

రికార్డు స్థాయిలో మోపిదేవి స్వామి హుండీ ఆదాయం

Satyam NEWS

Leave a Comment