40.2 C
Hyderabad
May 1, 2024 16: 24 PM
Slider ఖమ్మం

శాస్త్రీయ విద్యా విధానం కావాలి

#scientific education

దేశానికి కావాల్సింది సనాతన ధర్మం కాదు శాస్త్రీయ విద్యా విధానం కావాలని AISF జాతీయ ఉపాధ్యక్షులు రావి శివరామకృష్ణ పేర్కొన్నారు ఖమ్మం యూనివర్సిటీ అనుబంధ పిజి కళాశాలలో AISF 30 వ జాతీయ మహాసభల గోడపత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ ఎఐఎస్ఎఫ్ జాతీయ మహా సభలు బిహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్ లో

ఈ నెల 28నుండి అక్టోబర్ 1 వరకు జర్గున్నాయి అన్నారు దేశంలోని నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం నూతన జాతీయ విద్య 10+2+3+ కి బదులుగా5+3+3+4 విధానం అమల్లోకి తీసుకువస్తుందని అన్నారు విద్యా విధానాన్ని మార్పులు చేస్తూ విద్యను కాసాయికరణ వైపు తీసుకెళ్తున్నారు అన్నారు సనాతన ధర్మం పేరుతో విద్యార్థులు మొదడు లో మత

విద్వేషాలను నింపుతున్నారని ఆయన ఆరోపించారు దేశ కీర్తి ప్రతిష్టలను ప్రతిబింబించేలా చేసిన ఇస్రో లాంటి సంస్థలకు శాస్త్రవేత్తలును అందించే విద్యా విధానాన్ని ఈ దేశం కోరుకుంటుందన్నారు అంతేగాని ఆర్ఎస్ఎస్ బిజెపి సంఘపరివార శక్తులు కోరుకునే విద్యా కాషాయకరణ కాదనీ అన్నారు జాతీయ మహాసభలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక సంస్థలపై సుదీర్ఘంగా చర్చిస్తామని తెలిపారు జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటికాల రామకృష్ణ జిల్లా నాయకులు యువరాజ్ శివ నాయక్ చందులాల్ ఆకాష్ సంతోష్ నవ్య శ్రీ సతీష్ నరేష్ గోపి ఉమా శైలజ వెంకటేష్ నరేష్ తదితరులు పాల్గొన్నారు

Related posts

గంజాయి సరఫరా చేస్తే ఉపేక్షించేది లేదు

Satyam NEWS

డోంగ్లీ లో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం    

Satyam NEWS

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు

Satyam NEWS

Leave a Comment