38.2 C
Hyderabad
May 3, 2024 20: 05 PM
Slider ముఖ్యంశాలు

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు

#YSJaganmohanReddy

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ, అసత్య ప్రచారాలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఏపీ సీఐడీ హెచ్చరించింది. సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న సీఐడీ తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.

మార్ఫింగ్ ఫొటోలు పోస్టు చేసినా,అసత్యాలు ప్రచారం చేసినా, కించ పరిచేలా పోస్టులు పెట్టినా కేసులు ఫైల్ చేస్తామని స్పష్టం చేసింది. అంతేకాదు డబ్బులిచ్చి దుష్ప్రచారం చేసే వారిని ప్రోత్సహించే వారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

అలాంటి వారికి శిక్ష తప్పదని తేల్చి చెప్పింది. డబ్బు కోసమో లేక లాభాపేక్షతోనో… ప్రభుత్వాన్ని,మహిళలను, గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నవారిని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే.. కఠిన చర్యలు ఉంటాయని, శిక్ష తప్పదని ఏపీ సీఐడీ వెల్లడించింది.

సోషల్ మీడియాలో పోస్టులను, వీడియోలను, ఇతరుల వ్యాఖ్యలను షేర్ చేసే ముందు పరిశీలన చేయాలని, అది నిజమో కాదో నిర్ధారణ చేసుకోవాలని సీఐడీ హితవు పలికింది. ఘర్షణలు రేకెత్తించే పోస్టులకు దూరంగా ఉండాలని సూచించింది. ఆధారాలు లేకుండా ఆసత్య, అబద్దాలను పోస్ట్ చేసిన కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించింది.

వ్యక్తులు,పార్టీలు, మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషల మధ్య చిచ్చు పెట్టడం. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం. ఇతరులను కించపర్చేలా పోస్టులు, ఫోటోలు పెడితే ఐపీసీ సెక్షన్ 505 కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తామని, నేరం నిరుపితమైతే.. మూడేళ్లకు పైగా జైలు శిక్షతో పాటు జరిమానా పడే అవకాశాలు వుంటాయని హెచ్చరించింది.

Related posts

స్టేట్ మెంట్: కమ్మోళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేరు

Satyam NEWS

ముఖ్యమంత్రి కార్యాలయంపై ముసురుకున్న మరో వివాదం

Satyam NEWS

జగన్ పై యుద్ధం ప్రకటించిన నవశకం లోకేష్

Satyam NEWS

Leave a Comment