శ్రీచైతన్య స్కూల్ బస్సు బోల్తా పడ్డ సంఘటనలో 15 మంది టీచర్లు తీవ్రంగా గాయపడ్డ సంఘటన జరిగింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కురిచేడు దొనకొండ మధ్యలో పొట్లపాడు వద్ద నేడు ఈ ప్రమాదం జరిగింది. శ్రీచైతన్య స్కూల్ బస్సు ఒక్క సారిగా బోల్తా పడటంతో బస్సులోని 30 మంది ప్రయాణీకులలో సుమారు 15 మందికి తీవ్ర గాయాలు తగిలాయి.
వీరంతా నరసరావుపేట డివిజన్ పరిదిలో వినుకొండ, డివిజన్ పరిధిలో శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచి ఉపాధ్యాయులు. వీరంతా కలిసి భైరవకోన కు టూర్ కు వెళుతుండగా మార్గమధ్యంలో బస్సు ప్రమాదానికి గురైంది. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కురిచేడు ప్రాథమిక వైద్యశాలలో ఫస్ట్ ఎయిడ్ చేసి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట గుంటూరు ఆసుపత్రికి తరలించారు.