38.2 C
Hyderabad
April 29, 2024 14: 54 PM
Slider ముఖ్యంశాలు

రూప్ టాప్ సౌర విద్యుత్ఉత్పత్తికి ప్రోత్సాహాకం

#jagadishreddy

రూప్ టాప్ ద్వారా సౌర విద్యుత్పత్తికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.ఆదివారం రోజున రాష్ట్ర శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభ్యులు గువ్వల బాలరాజు,కోరుకంటి చందర్,కే.మహేష్ రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ పున రుత్పాదక ఇంధన వనరులు సౌర,పవన,వ్యర్థాలనుంచి విద్యుత్ ఉత్పత్తి పెంచాడం తో పాటు వినియోగించుకోవడానికి తెలంగాణా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు.

సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంపొందించే ప్రక్రియలో భాగంగా సోలార్ టెండర్లు, ఆన్ లైన్ లో ధరకాస్తూల స్వికరణ,సౌర రూప్ టాప్ ట్రాకింగ్,నెట్ మిటరింగ్ వంటి వినియోగ సౌలభ్యం మొదలైన సదుపాయాలతో పునరుత్పాదక ఇంధన సామర్ధ్య జోడింపులతో రాష్ట్రాన్ని అగ్రగామిగా మార్చడానికి దోహదపడ్డాయని ఆయన చెప్పారు.

జనవరి,2023 చివరి నాటికి పునరూత్పాదక ఇంధన సామర్ధ్యం 6,159 మేఘావాట్లు నమోదు అయ్యిందన్నారు.ఆన్ లైన్ ట్రాకింగ్, సాధన పర్యవేక్షణ లతో ప్రారంభించబడి పార దర్శకతతో పాటు వినియోగదారుల స్నేహపూర్వక సాధన ప్రక్రియలతో రూప్ టాప్ పై సోలార్ జోడింపును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహిస్తుందన్నారు.ఇది 287 మేఘావాట్ల సౌర రూప్ టాప్ సామర్థ్యాన్ని సాధించ డానికి టి యస్ డిస్కమ్ లకు సహాయ పడిందని ఆయన పేర్కొన్నారు.

2023 జనవరి చివరి నాటికి 5748 మేఘావాట్ల సౌర విద్యుత్,128.10 మేఘావాట్ల పవన విద్యుత్ ను ఉత్పత్తి చేసినట్లు ఆయన సభకు వివరించారు. రాబోయే రెండు సంవత్సరాలలో 2,500 మేఘవాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ప్రారంభించ బోతున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.  

Related posts

దిశ తండ్రి సోదరిని కూడా వదలని మానవ హక్కులు

Satyam NEWS

జీవితాంతం గుర్తుండిపోయే సినిమా ‘ఛార్లి 777’

Satyam NEWS

అత్యాచారయత్నం నిందితుడిని కాపాడే యత్నం?

Satyam NEWS

Leave a Comment