26.7 C
Hyderabad
May 3, 2024 07: 28 AM
Slider ప్రత్యేకం

నామినేషన్ దాఖలు చేసిన కేసీఆర్

#kcr

సీఎం కేసీఆర్ కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్ లో నామినేషన్ వేసిన అనంతరం కామారెడ్డి ఎస్పీ కార్యాలయం హెలిప్యాడ్ వద్ద సరిగ్గా ఉదయం 11:58 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా కామారెడ్డిలో అడుగుపెట్టిన కేసీఆర్ కు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంలో నేరుగా ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటికి చేరుకుని ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. నాయకులకు దిశానిర్దేశం చేసిన అనంతరం మధ్యాహ్నం 1:58 నిమిషాలకు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని 2:05 నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశారు.

2:22 నిమిషాలకు ఆర్డీఓ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఆర్డీఓ కార్యాలయం నుంచి నేరుగా తిరిగి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య సీఎం కేసీఆర్ సభాప్రాంగణం వద్దకు చేరుకోనున్నారు. సీఎం వెంట ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబోద్దీన్, మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి, రాష్ట్ర ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ కొమ్ముల తిర్మల్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ పున్న రాజేశ్వర్, సీనియర్ నాయకులు ఎంజి వేణుగోపాల్ గౌడ్, మామిండ్ల ఆంజనేయులు ఉన్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

హీరో చిరంజీవికి కరోనా పాజిటివ్

Sub Editor

కరోనా ఎలర్ట్: రోడ్లపై ఎందుకు తిరుగుతున్నారు?

Satyam NEWS

పొలంలో నాట్లు వేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Bhavani

Leave a Comment