33.2 C
Hyderabad
May 12, 2024 12: 44 PM
Slider ఆదిలాబాద్

స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ కింద ముఖ్రా కె గ్రామం ఎంపిక

kcr

తెలంగాణలోనే నూటికి నూరు శాతం బహిరంగ మల విసర్జన రహిత హోదాను సాధించిన ఏకైక గ్రామ పంచాయతీగా అదిలాబాద్ జిల్లాకు చెందిన ముఖ్రా కె గ్రామాన్నికేంద్ర జలవనరుల శాఖ స్వచ్ భారత్ మిషన్ కింద ఎంపిక చేయ‌డం ప‌ట్ల గ్రామ స‌ర్పంచ్ ఎంపీటీసీల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ అభినందించారు. ఈ సంద‌ర్భంగా గ్రామ స‌ర్పంచ్ జి. మీనాక్షి, ఎంపీటీసీ జి. సుభాష్‌లు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుతో క‌లిసి సీఎం కేసీఆర్‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో క‌లిశారు.
ముక్రకె గ్రామం ఓడీఎఫ్ ప్ల‌స్‌ గ్రామంగా ఎంపిక అవ్వడం తెలంగాణకే గర్వకారణం అని సిఎం కేసీఆర్ సంతోషం వ్య‌క్తం చేశారు. గ్రామంలో వంద శాతం మొక్కలు బ్రతకడం, సేంద్రియ ఎరువుల త‌యారీ విధానంలో తొలి గ్రామంగా పేరు పొందిన గ్రామ ప్ర‌జ‌లను సీఎం కేసీఆర్ అభినందించారు. మున్ముందు ఇదే స‌మ‌న్వ‌యంతో వెళుతూ మ‌రిన్ని విజ‌యాల‌ను సొంతం చేసుకోవాల‌ని గ్రామాల‌కు కావాల్సిన అవ‌స‌రాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం తీరుస్తుంద‌ని, తెలంగాణ‌లోని గ్రామాల‌న్నీ స్వ‌చ్ఛ రూపు రేఖ‌ల‌నుదాల్చు కోవ‌డ‌మే త‌మ ఉద్దేశ్య‌మ‌ని అన్నారు.

Related posts

బిజెపి నుంచి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు నిధులు?

Satyam NEWS

శాకంబరి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబ దేవి

Satyam NEWS

టిఆర్ఎస్ ప్రభుత్వం నుండి తెలంగాణను కాపాడుకుందాం

Satyam NEWS

Leave a Comment