36.2 C
Hyderabad
May 8, 2024 18: 16 PM
Slider శ్రీకాకుళం

లోప భూయిష్టంగా జిల్లాలో భాషోపాధ్యాయుల పని సర్దుబాటు

#language teachers

ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖలో సాగుతున్న ఉపాధ్యాయుల పని సర్దుబాటు ప్రక్రియ లోప భూయిష్ఠంగా మారిందని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ, శ్రీకాకుళం జిల్లా శాఖ ఆరోపించింది. ఈ మేరకు జిల్లా శాఖ ప్రతినిధులు పిసిని వసంతరావు, కూన రంగనాయకులు, కుప్పన్నగారి శ్రీనివాసరావు డీఈవో గార పగడాలమ్మను కలసి వినతిపత్రం అందించారు.

ఈ ప్రక్రియలో మిగులుగా తేలిన పోస్టుల్లో భాషోపాథ్యాయులు(తెలుగు,హిందీ) సుదూర ప్రాంతాలకు బదిలీ అవుతుండడం విషాదకరంగా ఉందని అన్నారు. మెలియాపుట్టి మండలం నుంచి పని సర్దుబాటు పేరిట ఇచ్చాపురం మండలానికి, కొత్తూరు నుంచి పలాసకు పని సర్దుబాటు చేయడంలో ఉన్న హేతుబద్ధత ఏమిటో అర్థం కాకుండా ఉందని విమర్శించారు. అలాగే ఈ సర్దుబాటు ప్రక్రియలో హృద్రోగ, కిడ్నీ బాధితులు కూడా ఉన్నారు.

వారికి కూడా ఈ సర్దుబాటు వల్ల దూరప్రాంతాలకు వెళ్ళవలసి వస్తోందని వాపోయారు. ప్రభుత్వ మార్గదర్శకాలను విద్యాశాఖ సక్రమంగా అమలు చేస్తున్నట్లుగా కనిపించడం లేదని, ఇలాంటి అస్పష్టమైన లోప భూయిష్టమైన ప్రక్రియకు స్వస్తి చెప్పి మిగులు పోస్టులుగా తేలిన బాషోపాధ్యాయులందరికీ కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా న్యాయం చేయాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ శ్రీకాకుళం జిల్లా శాఖ డిమాండ్ చేశారు. DEO ను కలిసనవారిలో జిల్లా అధ్యక్షులు పిసిని వసంతరావు సహాధ్యక్షులు కుప్పన్నగారి శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి బండారు రామచంద్రరావు, పలువురు బాధిత భాషా పండితులు ఉన్నారు.

Related posts

శ్రీకాళహస్తి సీఐపై ఎస్పీకి పవన్‌ ఫిర్యాదు

Bhavani

రెడ్‌జోన్ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ మ‌రింత ప‌టిష్టం

Satyam NEWS

జాతీయ స్థాయిలో జగన్ పరువు తీస్తున్న రఘురామ

Satyam NEWS

Leave a Comment