40.2 C
Hyderabad
May 2, 2024 18: 58 PM
Slider వరంగల్

వర్గీకరణకు మద్దతు ఇవ్వకుంటే బీజేపీకి అధోగతే

#Burri Satish

SC రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కోసం గత 28 సంవత్సరాలు గా పోరాడుతుంటే BJP ప్రభుత్వం మోసం చేస్తున్నదని MRPS తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీష్ మాదిగ అన్నారు. బీజేపీ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి ని బిజెపి కార్యాలయంలో ములుగు జిల్లా కేంద్రంలో MRPS ములుగు జిల్లా కన్వీనర్ పుల్లూరు కరుణాకర్ మాదిగ అధ్యక్షతన కలిసి వినతిపత్రం అంద చేశారు. Sc రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో MSPమహాజన సోషలిస్ట్ పార్టీ ములుగు జిల్లా కోఆర్డినేటర్ ఇరుగు పైడి కూడా పాల్గొన్నారు. తాము అధికారంలోకి వస్తే వంద రోజులలో ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని మాట ఇచ్చి తీరా అధికారంలోకి రాగానే బిజెపి ప్రభుత్వం మాట మార్చిందని వారన్నారు. అధికారంలోకి వచ్చి8 సంవత్సరాలు గడుస్తున్నా తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని SC వర్గీకరణ లేకపోవడంతో వేలాదిమంది యువత విద్య, ఉద్యోగ అవకాశాలు లేక చాలా నష్ట పోతున్నారని వారన్నారు. Sc వర్గీకరణ కు వెంటనే చట్టబద్ధత కల్పించక పోతే మిగతా రాజకీయ పార్టీలకు పట్టిన గతే BJP కి పడుతుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో MRPS ములుగు జిల్లా నేతలు MSP ములుగు నియోజకవర్గ కోఆర్డినేటర్ జన్ను రవి దండోరా జాతీయ నేత నెమలి నరసయ్య మాదిగ MSP ములుగు నియోజకవర్గ ఇన్చార్జి వావిలాల స్వామి మాదిగ MSP సీనియర్ నేత మడిపెళ్లి శ్యాంబాబు మాదిగ MSF జిల్లా కోఆర్డినేటర్ వాసం పెళ్లి చైతన్య మాదిగ MSP ములుగు మండల నాయకులు కనకం దాసు విహెచ్పిఎస్ కొడాలి సాంబయ్య దేవేందర్ యాదవ్ పోకల సుదర్శన్ మాదిగ ఇటికాల రవీందర్ ఎనిగందుల రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Related posts

బోరుబావిలో పడ్డ చిన్నారి సుజిత్ మృతి

Satyam NEWS

కర్ఫ్యూ ఆదేశాలు తుంగలోకి..ఎస్పీ రావడంతో వ్యాపారస్థులు బెంబేలు..!

Satyam NEWS

ఎంతటి వారికైనా విద్యాబుద్ధులు నేర్పేది గురువే

Satyam NEWS

Leave a Comment