27.7 C
Hyderabad
April 26, 2024 06: 08 AM
Slider ప్రత్యేకం

జాతీయ స్థాయిలో జగన్ పరువు తీస్తున్న రఘురామ

#RaghuramakrishnamrajuMP

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరువు ప్రతిష్టల్ని బజారున పెట్టేస్తున్నారు. రఘురామకృష్ణంరాజుతో ఎందుకు పెట్టుకున్నాం అని పశ్చాత్తాపపడే విధంగా ఆయన చేస్తున్న చర్యలు ఉన్నాయి.

రఘురామకృష్ణంరాజు ను ఆయన పుట్టిన రోజు నాడే హైదరాబాద్ లో అరెస్టు చేసి 300 కిలోమీటర్ల అవతలకు తీసుకువెళ్లి లాకప్ లో పెట్టిన ఏపి సిఐడి పోలీసుల వలను ఛేదించుకున్న రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టు బెయిల్ తో బయటపడ్డారు.

ఆ నాటి నుంచి తనపై జరిగిన కుట్రకు సంబంధించిన విషయాలను ఒక్కొక్కటిగా ఆయన బయటపెడుతున్నారు. జాతీయ మానవ హక్కుల సంఘం రఘురామకృష్ణంరాజుపై పోలీసు లాకప్ లో జరిగిన వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నది.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స జరిగిన సమయంలో కూడా తనపై ముగ్గురు అధికారులు కుట్ర పన్నారని రఘురామకృష్ణంరాజు ఆరోపిస్తూ కేంద్ర రక్షణ శాఖ మంత్రికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఇది జరిగిన కొద్ది గంటల్లోనే గుంటూరు అర్బన్ ఎస్ పి అమ్మిరెడ్డిని ప్రభుత్వం అక్కడ నుంచి తొలగించింది. నిన్న ఏఏజిపై రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆయన మరో అడుగు ముందుకు వేసి దేశంలోని అన్ని పార్టీల ఎంపీలకు లేఖ రాశారు.

తన అరెస్ట్‌ తదనంతర పరిణామాలను ఆయన ఆ లేఖలో వివరించారు. రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీలకు అతీతంగా తనకు మద్దతివ్వాలని లేఖలో కోరారు. దేశంలో తొలిసారి ఓ ఎంపీపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని తెలిపారు.

అయితే ఎంపీ రఘురామ లేఖను చూసి  పలువురు ఎంపీలు ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది. జగన్‌ ప్రభుత్వానిది హిట్లర్‌ పాలనగా కాంగ్రెస్‌ ఎంపీ మానిక్కం ఠాగూర్‌ అభివర్ణించారు. రఘురామ లేఖను ట్విటర్‌లో ఠాగూర్‌ పోస్ట్‌ చేశారు.

రఘురామపై పోలీసుల దాడిని ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని పలువురు ఎంపీలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని తాను సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేశానన్న కక్షతోనే తనపై అక్రమ కేసులు బనాయించారని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు రఘురామ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఆయన బుధవారం రాత్రి ఇక్కడ 9.20 గంటలకు స్పీకర్‌ను కలిశారు. దాదాపు అర్ధ గంట సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనపై పెట్టిన రాజద్రోహం కేసు, తదనంతర పరిస్థితులన్నీ వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు.

తన కేసులో సీఎం జగన్‌రెడ్డి, డీజీపీ, సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌, ఏఎ్‌సపీ విజయ్‌పాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

Related posts

ఉత్తరప్రదేశ్ లో పడవ ప్రమాదం

Murali Krishna

ఉత్సాహాంగా సాగుతున్న పల్నాటి సంబరాలు

Satyam NEWS

కొల్లాపూర్ లో రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment