40.2 C
Hyderabad
April 28, 2024 15: 56 PM
Slider గుంటూరు

కేంద్రంలో ఓబీసీ ప్రత్యేక మంత్రిత్వ సాధనకై 9న మహా ధర్నా

#OBC special

కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9వ తేదీన గుంటూరులో కలెక్టరేట్ వద్ద ఓబీసీల మహాధర్నా చేపడుతున్నట్లు ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ వెల్లడించారు. సోమవారం నరసరావుపేట విచ్చేసిన వరప్రసాద్ యాదవ్ బీసీ కుల సంఘాల నేతలతో సమావేశమయ్యారు. అనంతరం అంగిరేకుల విలేకరుల సమావేశంలో వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ 52 శాతం జనాభా కలిగిన ఓబీసీల సంక్షేమ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షపూరితమైన వైఖరినీ విడనాడాలన్నారు.

భారతదేశంలో జంతువులకి సైతం ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉందని కానీ ఈ దేశంలో మెజారిటీ ప్రజల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం శోచనీయమన్నారు. మండల్ కమిషన్ , నాచియప్పన్ పార్లమెంటరీ కమిటీ ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసినప్పటికీ ఉద్దేశపూర్వకంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దీనికి తగిన రూపంలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ని గొప్పలు చెప్పుకుంటున్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓబీసీ ప్రధాని అయిన నరేంద్ర మోడీ ఓబీసీల రక్షణకి, సంక్షేమానికి బీసీల వికాసానికి చర్యలు తీసుకోకపోవడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై ప్రధాన నరేంద్ర మోడీ ప్రధాన ప్రకటన చేయాలని వరప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు.

జాతీయ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని ఓబీసీ విద్యార్థులకు వర్తింపజేయాలని వరప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. చట్టసభలో ఓబీసీ రిజర్వేషన్ల కల్పనపై పార్లమెంటరీ సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి వరప్రసాద్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.

ఈ నెల తొమ్మిదో తేదీన గుంటూరులో జరిగే ఓబీసీల మహా ధర్నాకి బీసీ కులాల ప్రజాప్రతినిధులు వృత్తిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర, మరియు పల్నాడు జిల్లా ప్రతినిధులు దేవళ్ళ వెంకటేశ్వరరావు, బత్తుల వెంకటేష్, బొందిలి శ్రీనివాస్ సింగ్, షేక్ అలీ, మనోజ్ కుమార్, ఎస్కే. బాజీ, ఎన్. సంతోష్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో రహమ్మతుల్లా భేటీ

Satyam NEWS

గాంధి కుటుంబానికి చిన్ననాటి స్నేహితుల ఆర్థిక సహాయం

Satyam NEWS

నేడే మేడే

Satyam NEWS

Leave a Comment